Dr,BR Ambedkar గారి రచన
*Buddha or Karl Marx*
Section.1 నుంచీ
*బుద్ధుడు* అంటే అందరికీ సాధారణంగా గుర్తుకు వచ్చేది *అహింస*.. ఐతే, అతని బోధనల సారమంతా *అదేననీ అంతకు మించి ఏమీ లేదనీ అనుకుంటుంటారు..*
అతని బోధనలు అలా పరిమితం కాదనీ ఎంతో విస్తృతమనీ చాలమందికి తెలియదు. కనుక *అతని సిద్ధాంతాలు ఏమిటో చెప్పవలసిన అవసరం ఉంది*.
త్రిపిటకం పఠనం ద్వారా నేను తెలుసుకున్న సారాంశం క్రింద వివరించాను.
1. *స్వేచ్ఛా సమాజానికి మతం యొక్క అవసరం ఉంది.*
2. *ఐతే అన్ని మతాలకూ ఆ అర్హత ఉండదు*
3. *మతం అనేది జీవిత వాస్తవాలకు సంబంధించినదే తప్ప, ఆత్మ పరమాత్మ భూమి ఆకాశం ల గురించిన ఊహాగానాలకో సిద్ధాంతాలకో సంబంధించినది కాదు.*
4. *దేవుడు కేంద్రంగా ఉండే మతం తప్పు.*
5. *మోక్షం కేంద్రంగా ఉండే మతం తప్పు.*
6. *జంతుబలి ఇవ్వటం కేంద్రంగా ఉండే మతం తప్పు.*
7. నిజమైన మతం మనిషి హృదయంలో వికశిస్తుంది కానీ మతగ్రంథాలలో కాదు.
8. *మనిషి మరియు నైతికత కేంద్రంగా ఉండేదే ఆచరించదగిన మతం. అలా కానిది కేవలం క్రూరమయిన మూఢనమ్మకం.*
9. *నైతికత అనేది జీవితానికి కేవలం ఒక ఆదర్శంగా ఉంటే సరిపోదు. దైవం అనేది లేదు కనుక, నైతికతే మానవజీవితాన్ని నిర్దేశించే నియమంగా ఉండాలి.*
10. *మతం యొక్క విధి సమాజాన్ని సంఘటితంగా మరియు సంతోషంగా ఉండేలా చేయటమే గానీ, ప్రపంచపు మూలాన్నో లేక అంతాన్నో ఊహించటం కాదు.*
11. *వివిధ ప్రయోజనాల సంఘర్షణ వలన ప్రపంచంలో దుఃఖం కలుగుతుంది, దానిని పరిష్కరించడానికి ఏకైక మార్గం అష్టాంగ మార్గాన్ని అనుసరించడం.*
12. *వనరులపై కొన్ని వర్గాల ఆధిపత్యం, ఆ వర్గాలకు అధికారాన్ని తెస్తే, అవి లేని వర్గాలకు దుఃఖం కలిగిస్తుంది*.
13. ఈ దుఃఖ కారణాలను తొలగించటం సమాజ శ్రేయస్సు కోసం అత్యవసరం.
14. మనుషులందరూ సమానమే.
15. *జన్మ కాదు .. విలువలే మనిషి యొక్క కొలమానం.*
16. ముఖ్యమైనది ఉన్నతమైన ఆదర్శాలే కానీ జన్మ కాదు.
17. మైత్రి లేదా అందరితో సహవాసం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, అది శత్రువైనా సరే.
18. ప్రతి ఒక్కరికి నేర్చుకునే హక్కు ఉంది. మనిషి జీవించటానికి తిండి ఎంత అవసరమో, నేర్చుకోవడం కూడా అంతే అవసరం.
19. సచ్చరిత్ర లేని నేర్పు ప్రమాదకరం.
20. ప్రతి ఒక్కటి విచారణ మరియు పరీక్షకు లోబడి ఉంటుంది. ఏదీ పరమ సత్యమో మిత్య సత్యమో కాదు.
21. ఏదీ ఫైనల్ కాదు.
22. ప్రతిదీ కార్య కారణ సంబంధాలకు లోబడే ఉంటుంది.
23. *ఏదీ శాశ్వతమైనది లేదా సనాతనమైనది కాదు*. ప్రతి విషయం మార్పుకు లోబడి ఉంటుంది. ఉంది అంటే మార్పు ఉందనే.
24. *యుద్ధం నిజం మరియు న్యాయం కోసమే తప్ప ఆధిపత్యం కోసమో పగ కోసమో కాదు.*
25. *యుద్ధంలో గెలిచిన వారికి ఓడిపోయిన వారి పట్ల బాధ్యతలు ఉంటాయి.*
ఇది సారాంశ రూపంలో బుద్ధుని బోధన.
ఎపుడోచెప్పినా ఇప్పటికీ ఎంత తాజాగా ఉంది!!.
ఆయన బోధనలు ఎంత విశాలమైనవి, ఎంత లోతైనవి!
~Dr,BR Ambedkar,
Buddha or Karl Marx, Section.1
అనువాదం: Bala Nayuni