Monday, May 24, 2021

Six Indian Philosophies

 షడ్దర్శనములు


వేదములు (శ్రుతులు)

ఋగ్వేదం · యజుర్వేదం

సామవేదము · అధర్వణవేదము

వేదభాగాలు

సంహిత · బ్రాహ్మణము

అరణ్యకము  · ఉపనిషత్తులు

ఉపనిషత్తులు

ఐతరేయ  · బృహదారణ్యక

ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య

కఠ  · కేన  · ముండక

మాండూక్య  ·ప్రశ్న

శ్వేతాశ్వర

వేదాంగములు (సూత్రములు)

శిక్ష · ఛందస్సు

వ్యాకరణము · నిరుక్తము

జ్యోతిషము · కల్పము

స్మృతులు

ఇతిహాసములు

మహాభారతము · రామాయణము

పురాణములు

ధర్మశాస్త్రములు

ఆగమములు

శైవ · వైఖానసము ·పాంచరాత్రము

దర్శనములు

సాంఖ్య · యోగ

వైశేషిక · న్యాయ

పూర్వమీమాంస · ఉత్తరమీమాంస

ఇతర గ్రంథాలు

భగవద్గీత · భాగవతం

విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు

లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు

శివ సహస్రనామ స్తోత్రము

త్రిమూర్తులు · తిరుమల తిరుపతి

పండుగలు · పుణ్యక్షేత్రాలు

... · ...

ఇంకా చూడండి

మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము

హిందూమత సాంప్రదాయంలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి.


వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనములు అంటారు. అవి


సాంఖ్యము: కపిల మహర్షిచే ప్రవర్తింపజేయబడినది. ప్రకృతి లేక మూల ప్రకృతి విశ్వసృష్టికి కారణమని సాంఖ్య సిద్ధాంతము. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుష సంయోగమువలన బుద్ధి జనించును. పురుషుడు బుద్ధిచేయు చేష్టలను తనవిగా భావించుకొని సంసారములో బంధింపబడును. ప్రకృతి, పురుషుల స్వభావమును గ్రహించి, ఈ బంధమునుండి విడివడుటయే మోక్షము.

యోగము: పతంజలి మహర్షి యోగదర్శనమును రచించెను. ఇందులో మనసును నిగ్రహించుటకు తగిన ఉపాయములు బోధింపబడినవి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యఅహారము, ధ్యానము, ధారణ, సమాధి అను పది రకములైన అభ్యాసములచే మానవుడు ప్రకృతి-పురుష వివేకము పొంది ముక్తుడగును.

న్యాయము: న్యాయ దర్శనమును గౌతమ మహర్షి ప్రవర్తింపజేశారు.

వైశేషికము: వైశేషిక దర్శనమును కణాద మహర్షి ప్రవర్తింపజేశారు. ఈ రెండు దర్శనాలలో చాలావిధాలుగా పోలికలున్నాయి. ప్రపంచము పరమాణువులచే నిర్మించబడినది. కుండను చేయడానికి కుమ్మరి ఉండాలి గదా! అలాగే సృష్టిని చేసేవాడొకడుండాలి. అతడే భగవంతుడు. అని న్యాయదర్శనములో చెప్పారు.

జీవులు కర్మ బద్ధులై సుఖదుఃఖములను అనుభవిస్తున్నారు. సత్కర్మలను భగవత్ప్రీతికోసం చేసేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వారికి యోగమార్గంలో మోక్షం లభిస్తుంది.

పూర్వమీమాంస: వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త జైమిని మహర్షి. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు.

కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.

ఉత్తరమీమాంస: వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువ, డినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనము అనీ, బ్రహ్మసూత్రములు అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు దర్శనములలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.


ఇవన్నీ వేదములు ప్రమాణంగా చెప్పబడిన దర్శనాలు. ఇవే కాక వేదములను అంగీకరింపని వారు (చార్వాకులు, బౌద్ధులు, జైనులు ఇలాంటి వారు) చెప్పిన దర్శనాలు కూడా ఉన్నాయి.



వనరులు


హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానములు వారి ప్రచురణ




భారతీయ దర్శనములు

వికీపీడియా నుండి

Jump to navigationJump to search

మానవుడు ఐహికమగు సుఖముల నుండి విముక్తిను పొందుటకు, పరమ ఉత్కృష్టమయిన శాంతిని ఏ విధముగా పొంద వలయునో, దారి చూపునది, తెలియ జేయునది ఏదియో అదే దర్శనములు, అవియే వైదికములనియు, అవైదికములను రెండు వర్గములుగా విడదీసినారు.

(I) వైదిక దర్శనాలు:


(1) గౌతమ ఋషి న్యాయ దర్శనం, (2) కాణాద ఋషి వైశేషిక దర్శనం, (3) కపిల ఋషి సాంఖ్య దర్శనం, (4) పతంజలి ఋషి యోగ దర్శనం, (5) జైమిని ఆచార్యుల (జైమిన్యాచార్యుల) వారి పూర్వమీమాంసా దర్శనం (6) బాదరాయణాచార్యుల ఉత్తరమీమాంసా దర్శనం (వేదాంతదర్శనం). ఈ వీటినే షడ్దర్శనాలుఅని అంటారు.

(II) అవైదిక దర్శనాలు:


(1) లోకాయుత దర్శనం లేదా చార్వాక దర్శనం (2) జైన దర్శనం, (2) బౌద్ధ దర్శనం

vte

భారతీయ దర్శనములు

(6) వైదిక దర్శనములు

న్యాయ దర్శనము · వైశేషిక దర్శనము · సాంఖ్య దర్శనము · యోగ దర్శనము · పూర్వమీమాంసా దర్శనము · ఉత్తరమీమాంసా దర్శనము

Om symbol.svg

(2) అవైదిక దర్శనములు

జైన దర్శనము · బౌద్ధ దర్శనము

షడ్దర్శనాలు





విజ్ఞాన సర్వస్వం (నాల్గవ సంపుటం)

Jump to navigationJump to search

విజ్ఞాన సర్వస్వం (నాల్గవ సంపుటం)  (1992)  రచించినవారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు



విజ్ఞాన సర్వస్వము


దర్శనములు-మతములు


నాల్గవ సంపుటము

VignanaSarvasvamuVol4.djvu


ప్రధాన సంపాదకులు

ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి



సంపాదకులు


ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు


ఆచార్య పప్పు సూర్య సుందర రామారావు


ఆచార్య ఆర్యసోమయాజుల రామమూర్తి


ఆచార్య ముదిగొండ వీరభద్రశాస్త్రి



సహాయ సంపాదకుడు


డా. పగడాల చంద్రశేఖర్


భారతీయ తాత్విక పథికుడు - సచ్చిదానందమూర్తి K Sachchidananda Murthy

భారతీయ తాత్విక పథికుడు - సచ్చిదానందమూర్తి 
Jan 24 2016 @ 03:39AM

భారతీయ తత్వశాస్త్రం మతంతో ముడిపడి ఉన్నప్పటికీ అది శాస్త్రీయ చింతనను, సైన్స్‌ను వ్యతిరేకించలేదని సచ్చిదానందమూర్తి స్పష్టం చేశారు. వివిధ దేశాల తత్వ శాసా్త్రలను అధ్యయనం చేసి ప్రపంచానికి ఆయన ఒక కొత్త ఆలోచనా ధోరణిని ప్రసాదించారు. పదవీవిరమణ చేసిన తర్వాత స్వగ్రామం జాగర్లమూడిలో పితృపితామహులు నివసించిన ఇంట్లోనే నివసిస్తూ తన మేధస్సును ప్రపంచానికి పంచుతూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా శేష జీవితాన్ని గడిపిన నిజమైన తత్వవేత్త సచ్చిదానంద మూర్తి.

భారతీయ తత్వశాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది అన్వేషణకాదు, జిజ్ఞాసకు ప్రాధాన్యతనిచ్చింది. మతానికి అతీతంగా భారతీయ సనాతన సంప్రదాయం తాత్విక భావజాలానికి పెద్దపీట వేసింది. ప్రపంచంలో అన్ని తాత్విక చింతనల కంటే భారతీయ తాత్విక చింతన ప్రాచీనమైనది. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, భగవద్గీతలు మన నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు తాత్విక దృక్పథంతో సమాధానాలిచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రాచీన కాలంలో జరిగినంతగా భారత దేశంలో ఆధునిక కాలంలో తాత్విక చింతన చేసేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిలో ప్రముఖుడు కొత్త సచ్చిదానందమూర్తి.
 
తత్వశాస్త్ర రచనలో ఉన్నత ప్రమాణాలు సాధించిన సచ్చిదానందమూర్తికి ఎందుకో బాల్యంలోనే తాత్విక చింతన అబ్బింది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని జాగర్లమూడి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన పూర్వీకులు సంస్కృత భాష పట్ల అభిమానం కలవారు కావడం, బాల్యంలోనే సంస్కృతాన్ని నేర్చుకోవడంతో సచ్చిదానంద మూర్తి దృష్టి వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, భగవద్గీత పురాణేతిహాసాలు, దయానంద సరస్వతి, వివేకానందుడి జీవిత చరిత్రలపై పడింది. కాశీ కృష్ణమాచార్యులు, పరిపూర్ణాచార్యుల వద్ద సంస్కృతాధ్యయనం చేశారు. చిన్పప్పటినుంచే వేద మంత్రాలను ఉచ్ఛరిస్తూ వేదార్థాలను చెప్పే సచ్చిదానంద మూర్తిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయే వారు. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే ఆయన హనుమద్విజయం అనే పుస్తకం రాశారు. ఇంత చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పనిని చేసినవారు భారత దేశంలో శంకరాచార్యుడు తప్ప మరొక్కరు లేరు. సచ్చిదానంద మూర్తి తన భగవద్గీత గ్రంథంలో 20, 30 గ్రంథాలను ఉటంకిస్తూ ప్లేటో, క్రీస్తు, సిసిరో వంటి వారి వ్యాఖ్యానాలను కూడా పొందుపరచడం విశేషం. అరబిందో, మహాత్మాగాంధీ ఆశ్రమాలను ఆయన చిన్ననాడే సందర్శించారు. 12 సంవత్సరాల వయసులోనే ప్రాథమిక, మాధ్యమిక, విశారద పరీక్షల్లో ఉత్తీర్ణులై హిందీ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్ననాడే గీతానిధి, ఉపన్యాస కేసరి వంటి అనేక బిరుదులను పొందారు.
 
యుక్త వయసులో వైట్‌ హెడ్‌, ఉడ్‌రాన్‌, రామతీర్థ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రచనలు ఆయనను ఆకర్షించాయి. గుంటూరు కళాశాలలో విద్య పూర్తి చేసిన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఆనర్స్‌ డిగ్రీ, డాక్టరేట్‌ తీసుకున్నారు. పలు యూనివర్సిటీల్లో లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, డీన్‌గా, ప్రిన్స్‌పాల్‌గా పనిచేశారు. అమెరికాలోని ప్రిన్సిటన్‌ యూనివర్సిటీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సచ్చిదానంద మూర్తి తాత్విక చింతన ఎంత ప్రసిద్ధి చెందిందంటే ఆయన ఎంఎన్‌రాయ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ఇందిరాగాంధీ తదితరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారరావు లాంటి మేధావులు సచ్చిదానందమూర్తిని అభిమానించేవారు. ఆయనతో చర్చించేవారు. భారతీయ తత్వశాస్త్రం మతంతో ముడిపడి ఉన్నప్పటికీ అది శాసీ్త్రయ చింతనను, సైన్స్‌ను వ్యతిరేకించలేదని సచ్చిదానందమూర్తి స్పష్టం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తర్వాత ఏ భారతీయ తత్వ వేత్త చేపట్టని అంశాలను అధ్యయనం చేసిన వ్యక్తి సచ్చిదానంద మూర్తి అని సుప్రసిద్ధ జాతీయ భాషా శాస్త్రవేత్త ఆచార్య సునీతికుమార్‌ ఛటర్జీ ప్రశంసించారు.
 
తత్వ శాస్త్రంపైనే కాకుండా విదేశాంగ విధానం, ప్రపంచ శాంతి, రాజకీయాలు, చరిత్ర, సాహిత్యం లాంటివాటిని సచ్చిదానందమూర్తి స్పృశించారు. ప్రణాళికా రూపకల్పనలో తత్వవేత్తలు పాలుపంచుకునే అవకాశం ఉండాలి అని వాదించి సామాజిక చింతన పట్ల నేతలకు అవగాహన క ల్పించిన వ్యక్తి సచ్చిదానంద మూర్తి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నేతలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏది ఉన్నదో అదే తత్వం-ఉన్నది ఉన్నట్లుగా చూడడం తత్త్వ శాస్త్రం, ఉన్నదాని స్వరూపాన్ని గ్రహించడం తత్త్వ శాస్త్ర లక్ష్యం, వేదాంతం, తత్వ శాస్త్రంలో భాగం అని ఆయన నిర్వచించారు. బౌద్ధతత్వం నుంచి వైదిక ధర్మ పరంపర వరకు ఆయన అధ్యయనం చేసి భారతీయ తత్వశాస్త్ర విలువను ప్రపంచ దేశాలకు చాటి చెప్పి ప్రపంచ ప్రఖ్యాత తత్వశాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.
ఇండియన్‌ ఫిలాసఫికల్‌ కాంగ్రె్‌సకు అధ్యక్షుడుగా ఆయన భారతీయ తత్వశాసా్త్రనికి ఎనలేని సేవలను అందించారు. ఆఫ్రో ఏసియన్‌ ఫిలాసఫీలపై ఇంగ్లీషులో 30కి పైగా, తెలుగులో 12 పైగా అత్యంత ప్రాముఖ్యతగల గ్రంథాలను రచించారు. రామానుజ దర్శనం, మనిషి-ముక్తి ప్రమాణ పద్ధతి, ఈశోపనిషత్తు మొదలైన గ్రంథాలను తెలుగులో రచించి సర్‌ సిఆర్‌రెడ్డి ప్రశంసలు పొందారు. ఆయన రచించిన రెవలేషన్‌ అండ్‌ రీజన్‌ ఇన్‌ అద్వైత వేదాంత గ్రంథం మతాలలో ఉన్న తాత్విక చింతనపై మహోన్నత గ్రంథంగా ప్రఖ్యాతి చెందింది. అదే విధంగా శంకరాచార్య మీమాంస, అద్వైతం గురించి ఆయన రాసిన పుస్తకం దార్శనిక గ్రంథాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆయన రాసిన మరో పుస్తకం స్టడీస్‌ ఇన్‌ ద ప్రాబ్లమ్‌ ఆఫ్‌ పీస్‌ అనే గ్రంథం రాజకీయాలు, యుద్ధం, శాంతికి సంబంధించి సునిశిత పరిశీలన జరిపింది. ప్రపంచ శాంతి కోసం మేధావులు ఏకమై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. వివేచన-విశ్వాసం పరస్పర విరుద్ధాలు కావని ఆయన అభిప్రాయపడ్డారు.
 
భారతీయ తత్వవేత్తల్లో ఫార్‌ ఈస్టరన్‌ ఫిలాసఫీపై రచించిన మొదటి తత్వవేత్త సచ్చిదానందమూర్తే. విజ్ఞానసర్వస్వంలో దర్శనములు-మతములు పేర వెలువరించిన 7వ సంపుటానికి ఆయన సంపాదకత్వం వహించారు. తత ్వశాస్త్రంలో అత్యున్నత కృషి చేసిన వారికి ప్రదానం చేసే డాక్టర్‌ బీసీ రాయ్‌ నే షనల్‌ ఆవార్డు తొలిసారిగా కేంద్రం 1982లో డాక్టర్‌ సచ్చిదానందమూర్తికి ప్రదానం చేశారు. తత్వశాస్త్రంలోనూ, ఉన్నత విద్యా విధానంలోనూ ఆయన చేసిన కృషికి 1984లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌లను ఇచ్చి సత్కరించాయి. దేశవిదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థలు ఆయననను వివిధ ఆవార్డులతో సత్కరించాయి. మాస్కోలోని రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ , బల్గేరియాలోని సోఫియా యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ చైనా, జర ్మనీలోని పోల్‌-విట్టన్‌బర్గ్‌ యూనివర్సిటీలు, దేశంలో 9 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. స్వామి ప్రణవానంద తత్వశాస్త్ర జాతీయ బహుమతి, కలకత్తాలో దర్శన్‌ విజ్ఞాన్‌ ఫౌండేషన్‌, రాజ్యలక్ష్మీ ఆవార్డు, రాషీ్ట్రయ సంస్కృత విద్యాపీఠ్‌, తిరుపతి మహోమహోపాధ్యాయ, వారణాసి సంస్కృత విద్యా పీఠ్‌ అవార్డులు ప్రదానం చేశాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫిలసాఫికల్‌ రీసర్చ్‌ లైఫ్‌ టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు.
 
ప్రపంచమంతా చుట్టి వచ్చినా పదవీవిరమణ చేసిన తర్వాత స్వగ్రామం జాగర్లమూడిలో పితృపితామహులు నివసించిన ఇంట్లోనే నివసిస్తూ తన మేధస్సును ప్రపంచానికి పంచుతూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా శేష జీవితాన్నిగడిపిన నిజమైనతత్వవేత్త సచ్చిదానంద మూర్తి. తాను విశ్వసించిన సత్యాలకోసం, విశ్వాసాల కోసం ఎవరికీ తలవంచని వ్యక్తిత్వం ఆయనది. 2011 జనవరి 24న తన 87వ ఏట మరణించిన సచ్చిదానంద మూర్తి ప్రపంచ తత్వశాస్త్ర ప్రపంచంలో భారతీయ తత్వశాస్త్ర బావుటాను ఎగురవేశారు.
వై.ఎల్‌.పి
(నేడు సచ్చిదానంద మూర్తి వర్ధంతి)