Thursday, July 9, 2020

మాదిగ కులం.. అంటరాని కులం కానే కాదు

మాదిగ కులం.. అంటరాని కులం కానే కాదు
- మాల మహా వారియర్స్
మాదిగ కులం.. అంటరాని కులం కానే కాదు.. 👈🔷
🔷 👉 మరి వీరు SC జాబితాలో ఎలా చొరబడ్డారు 👈 🔷

✴️ మాదిగల మీద హిందూ మతం వివక్ష చూపించిందా..?? ✴️

       హిందు పురాణాల్లో మాదిగలకు వైష్ణవ హిందూమతం విశిష్టమైన స్థానం కల్పించింది..  కర్ధమ ముని అనే బ్రాహ్మణ ఋషి వారసులుగా,, అరుంధతీ వారసులుగా,, విశ్వంతో పాటు పుట్టిన జాంబవంతుని వారసులుగా వారికి విశిష్ట స్థానం కల్పించింది.. ఇప్పటికి కూడా పెళ్లిళ్లలో కొత్త జంటకు, మాదిగ మాత అరుంధతి ని చూపించడం ఆనవాయితీ...

       ఇతిహాసాల్లో కూడా మాదిగలకు విశిష్ట స్థానం కల్పించిబడినది.. త్రేతాయుగంలో రామాయణంలో మాదిగ మూల పురుషుడు,, రాముడికి, సీతను చేరుకోవడానికి, రావణుడి మీద యుద్ధం చేయడానికి, భల్లుక (ఎలుగుబంటి) రాజు అయిన జాంబవంతుడు, సహాయం చేసినట్టు రాసి ఉంది.. ద్వాపరయుగంలో మహాభారతంలో కూడా మాదిగ మూల పురుషుడు జాంబవంతుడు, కృషునికి శమంతకమణి తిరిగి ఇచ్చి,, తమ కూతురు జాంబవతిని ఇచ్చి పెళ్లి చేసి,, ఏకంగా విష్ణువుతోనే వియ్యం పొందినట్టుగా చెప్పబడింది..

✴️ మాదిగలు సామాజికంగా అంటరానితనం ఎదుర్కొన్నారా.. ?? లేదు..!! ✴️

        మాదిగల ప్రధాన వృత్తి, జంతు చర్మాన్ని వొలిచి, శుభ్రపరిచి, దానితో చెప్పులు, యుద్ధ సామగ్రి అయిన చర్మం తొడుగులు, డాలు లాంటివి వస్తువులు మరియు వాడుక వస్తువులు తయారు చేయడం..

        చెప్పులు తయారు చేయాలన్నా.. యుద్ధ సమయాల్లో రక్షణ కవచాలుగా చర్మంతో తొడుగులు తయారు చేయాలన్న కొలతలు తీసుకోవాలి.. కొలతలు తీసుకోవాలి అని తప్పకుండా ముట్టుకునే తీరాలి.. అంటే మాదిగలకు అంటరానితనం లేదు.. వారు మిగతా ప్రజలను ముట్టుకునే వెసులుబాటు ఉంది..

       మాదిగ కులంలో మాతంగి (జోగిని) అనే ఒక భయంకరమైన సాంఘిక దురాచారం ఉండేది.. మాదిగ కులపు ఆడబిడ్డలను జోగినులుగా, మాతంగులుగా ప్రకటించేవారు... వారు దేవుని భార్యగా దేవాలయాల్లో దేవుడికి సేవలు చేయడానికి, దేవాలయ ప్రాంగణంలో నృత్యాలు చేయడానికి నిర్దేశించబడ్డారు.. (జోగిని వ్యవస్థ వల్ల తరువాతి క్రమంలో మాదిగ ఆడబిడ్డల మీద జరిగిన అత్యాచారాలు ఇక్కడ అసందర్భం.).. దీనివల్ల మాదిగలకు దేవాలయ ప్రవేశం మీద ఆంక్షలు లేవు అని తెలుస్తుంది.. దేవుడికి వియ్యంకులుగా, దేవుడికి భార్యలుగా ఉన్న మాదిగ కులస్తులకు, దేవాలయ ప్రవేశం మీద ఆంక్షలు ఉండే అవకాశమే లేదు కదా...

       మరియు.. అదీకాక మాదిగలు అంటరానివారు అయితే, వారిని ముట్టుకుంటే మైల అయితే,, మతంగులతో, జోగినిలతో సవర్ణ హిందువులు లైంగిక కార్యకలాపాలు సాగించేవారు కూడా కాదు..

        మాదిగలు ఆవు మాంసం వల్ల అంటరానితనం ఎదుర్కొన్నారా అంటే... అదీ లేదు.. హిందువులు పవిత్రంగా భావించే ఆవుని మాదిగలు తింటారు కాబట్టి, వారి మీద అంటరానితనం విధించారు అని చెప్పడం అబద్ధం.. ఎందుకంటే.. హిందువులు చనిపోయిన ప్రతీ జంతువును ఊరి నుండి తొలగిస్తూ, దానికి ప్రతిగా బియ్యం ఆహార ధాన్యాలు పొందడానికి దళిత కులాలను నిస్సహాయులను చేశారు.. చనిపోయిన అన్ని జంతువులతో పాటు, ఆవులను కూడా తొలగించి, వాటి మాంసం తిని, వాటి చర్మంతో వస్తువులు తయారు చేయడం అనేది.. హిందువుల అంగీకరంతోనే జరిగిన చర్య.. అంతే తప్ప మాదిగలు ఆవుని వేటాడి, చంపి తినరు..

✴️ మాదిగలు ఆర్ధిక వివక్ష ఎదుర్కొన్నారా.. ?? లేదు..!! ✴️

 👉 SC కులాల్లో కుల వృత్తి కలిగిన ఒకే ఒక SC కులం.. మాదిగ.. 👈

     హిందూమతం అస్పృశ్యులకు నిర్దిష్ట వృత్తులు నిరాకరించింది.. నిర్దిష్ట కులవృత్తి ఉంటే  స్థిరమైన ఆదాయం ఉంటుంది..  నిర్దిష్ట కుల వృత్తి లేకుండా చేసి,, వీరు జీవించాలంటే అగ్రకులాల మీద ఆధారపడాలి అనేది వారి ఉద్దేశం.. శూద్ర కులాల నుండి పంచమ కులాలను వేరు చేసేది.. ఈ నిర్దిష్ట కులవృత్తి మాత్రమే..

      SC కులాల్లో కుల వృత్తి కలిగిన ఒకే ఒక దళిత కులం మాదిగ... మిగతా ఏ కులానికి కూడా కులవృత్తి లేదు... మాదిగల కులవృత్తి అయిన చర్మకార వృత్తి,, వారికి సంవత్సరం మొత్తం స్థిరమైన ఆదాయం ఇచ్చేది.. కాబట్టి మాదిగలు ఆర్థికపరమైన వివక్ష అనుభవించలేదు.. రాజులకు, జమీందారులకు, పాలకులకు, చివరికి వెంకటేశ్వరు స్వామికి సైతం చెప్పులు చేసి,, వీరు మణులు మాన్యాలు పొందినట్టు చాలా ఆధారాలు ఉన్నాయి.. దేవాలయాల్లో దేవుడి పాదుకలు (చెప్పులు) తయారు చేసి, దేవుడి మాన్యాలు (దేవాలయ భూముల ఆదాయంలో భాగం) పొందడం కూడా తెలిసిందే..

✴️ ❓ మరి సామాజికంగా, ఆర్ధికంగా ఎప్పుడు వివక్ష అనుభవించని మాదిగలు SC జాబితాలో ఎలా స్థానం పొందారు.. అనేది ఇప్పుడు ప్రశ్న.. ❓✴️
 
      ఇది కాంగ్రెస్ చేసిన కుట్ర అనే చెప్పాలి.. కేవలం దేశవ్యాప్తంగా ఉన్న చమార్లతో రాజకీయ అవసరాల కోసం.. జగ్జీవన్ రామ్ ఆధ్వర్యంలో చమార్ నాయకుల ఒత్తిడి మేరకు.. నిజానికి వృత్తి కులాలైన BC కులంగా ఉండాల్సిన మాదిగలను..దొడ్డిదారిలో SC జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ...

     మాదిగలు అనుభవించిన వివక్ష లాంటిదే.. ఇప్పుడు BC కులాలుగా ఉన్న చాకలి కులం, బెస్త కులం లాంటి చాలా కులాలు అనుభవించి ఉన్నప్పటికీ,, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వారిని SC జాబితాలో చేర్చారు.. కానీ చమార్ల జనాభా అధికం ఉండడంతో,, రాజకీయ కారణాలతో వారిని మాత్రమే దేశవ్యాప్తంగా SC జాబితాలో చేర్చారు..

✴️  చమార్లను SC జాబితాలో చేర్చడం వలన, SC సమాజానికి కలిగిన నష్టాలు ✴️

▪️అధిక జనాభా కలిగిన చమార్లను SC జాబితాలో చేర్చడం వలన,  మిగతా దళిత కులాలకు రిజర్వేషన్లు అందకుండా పోయాయి.. SC జాబితాలో ఎక్కువ ఒత్తిడి ఏర్పడింది..

▪️దానివాలనే 10 సంవత్సరాలలో రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందుతాయి అని కలలు కన్న రాజ్యాంగ నిర్మాతల కలలు నిర్వీర్యం అయ్యాయి..

▪️ దేశవ్యాప్తంగా ఉన్న SC రిజర్వేషన్లలో 90% పైగా చమార్లు అనుభవిస్తున్నా కూడా, వారి ప్రాబల్యం లేని ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం మేము వెనకబడిపోయాం కాబట్టి రిజర్వేషన్లను ముక్కలు చేసి, సగానికి పైగా మాకు కట్టబెట్టాలని,, దొంగ ఏడుపులు ఏడవడం మాదిగలకే చెల్లింది..

▪️ ముందు నుండి అగ్రకులాలతో స్నేహశీలురుగా, నమ్మకమైన అనుచరులుగా ఉన్న చమర్లు, మాదిగలు దళిత ఉద్యమాలను వెనక్కు లాగే ప్రయత్నాల్లో సఫలం అవుతూనే ఉన్నారు.. కాబట్టి దళిత ఉద్యమాలు వీరి వలనే చతికిలపడ్డాయి..

✴️ SC లు కాకపోయినా మొత్తం SC కులాలను తమ స్వార్ధానికి వాడుకున్న మాదిగలు ✴️

      తెలుగు రాష్ట్రాల్లో మాదిగల చరిత్రే దళిత చేరిత్రగా, మాదిగల స్వార్ధ ప్రయోజనాల కోసం చేసే పోరాటలే దళిత పోరాటాలుగా, మసిపూసి మారేడు కాయ చేయబడ్డాయి.. మాదిగల జీవన విధానం, దళితుల జీవనవిధానంగా, మాదిగల ఆస్తిత్వమే దళిత అస్తిత్వంగా ప్రచారం చేయబడింది...  చివరికి UP చమార్ల రాజకీయ ప్రయోజనాలే, దళిత జాతి రాజకీయాలుగా ప్రకటించబడ్డాయి..

       దీనితో దళిత సంస్కృతి, దళిత కులాల చరిత్ర,, అస్తిత్వం మరుగున పడిపోయింది... దీని వల్ల, దళిత ఉద్యమాలు దారితెన్ను లేకుండా ప్రయాణించసాగాయి..

     అసలు SC జాబితాలో ఉండడానికి అనర్హులైన మాదిగలు.. దొంగచాటుగా SC జాబితాలో చొరబడిన మాదిగలు.. చాలా తెలివిగా, మొత్తం దళిత జాతిని తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకున్నారు.. అనే నిజం ఇప్పటికైనా తెలుసుకోవాలి.. మొత్తం దళిత జాతిని తమ స్వార్ధానికి వాడుకుని,, సవర్ణ కులాల మీదకు ఉసిగొలిపి, వారు మాత్రం సవర్ణ కులాలకు సన్నిహితులుగా మారిపోవడం కూడా గమనించాలి..

⛔  SC జాబితాలోని ఈ చొరాబాటుదారులతో  జాగ్రత్త ⛔

    🔹 సత్యమేవ జయతే 🔹
🔷 జై భీమ్..!! జై భారత్..!! 🔷

No comments:

Post a Comment