మనుధర్మశాస్త్రం అసలేం చెప్పింది?
సమస్త వెనుకబాటుతనానికి కారణమైన కుల వ్యవస్థను కట్టుదిట్టం చేసి, కులధర్మమే హిందూ ధర్మంగా ప్రచారం చేసింది మనుధర్మం. కుల ధర్మాన్ని పాటించనివారికి కఠోరమై న శిక్షలు విధించి అసమానతలను పెంచి పోషించి సామాజిక చట్టంగా చెలామణి అయ్యింది మనుధర్మశాస్త్రం.
- జంగిటి వెంకటేష్
సమస్త వెనుకబాటుతనానికి కారణమైన కుల వ్యవస్థను కట్టుదిట్టం చేసి, కులధర్మమే హిందూ ధర్మంగా ప్రచారం చేసింది మనుధర్మం. కుల ధర్మాన్ని పాటించనివారికి కఠోరమై న శిక్షలు విధించి అసమానతలను పెంచి పోషించి సామాజిక చట్టంగా చెలామణి అయ్యింది మనుధర్మశాస్త్రం.
ఒకరకంగా చెప్పాలంటే 1950 వరకు అధికారికంగా, ఆ తర్వాత రాజ్యాంగం అమలైనప్పటికీ, అనధికారికంగా సమాజంలో అమలవుతున్నది మనుధర్మ శాస్త్రమే. దేశంలోని పాలన, సంపద, వాణిజ్య వ్యాపారాలు, సంస్థలు పరిశ్రమలు నేటికీ బ్రాహ్మణ, బనియా (వైశ్య) కులాల గుత్తాధిపత్యంగా ఉండడమే ఇందుకు ఉదాహరణ. స్వాతంత్య్రం సిద్ధించిన 70 ఏండ్లలో 14 మంది ప్రధానులు ఆధిపత్య కులానికి చెందినవారు కావడాన్ని ఎలా భావించాలి?
శూద్రులంటే ఎవరు?
శూద్రులంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు గాక మిగిలిన చాతుర్వర్ణ కులవ్యవస్థకు చెందిన వారు. అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కుమ్మరి, ఈడిగ, చాకలి, మంగలి మొదలైన కులాలను శూద్రులు అంటారు. వీరు ద్విజులు కాదు.
'బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మనులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారు' అని (ఋగ్వేదం 10 - 90 - 12) అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి.
'భగవద్గీత' 4వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకష్ణుడు కూడా పేర్కొన్నాడు. మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1వ అధ్యాయం 91వ శ్లోకంలో పేర్కొన బడింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే మనువుకు తాను బోధించినట్టు భగవద్గీత (4-1)లో పేర్కొన్నాడు.
బ్రాహ్మణ మత సామాజిక వ్యవస్థలో శూద్రుల స్థానం ఏవిధంగా నిర్ధేశించబడింది?
1.
'బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పైమూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష (సేవ ) చేయటం'. (మనుస్మ తి 1 - 91).
2.
శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించిన యెడల బ్రాహ్మనులను హింసించును. (మను 10 - 129).
3.
బ్రాహ్మణుడు ఎప్పుడైనా సందేహించకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానైనా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా. (మను 8 - 417)
4.
బ్రాహ్మణులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. (10-123).
5.
జీతభత్యాల ప్రమేయం లేకుండా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు.(మను 8- 413)
6.
బ్రాహ్మణుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చినిగిపోయిన పాత బట్టలను, పాత సామానును శూద్రుల కివ్వాలి. ( మను 10 - 125 )
7.
శూద్రుడు బ్రాహ్మణున్ని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుప కడ్డీతో వాని నాలుకను కాల్చాలి. (మను 8. 271 ).
8.
ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో, చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. (మను 8 - 272 )
9.
బ్రాహ్మణునితో సరి సమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. ( మను 8 - 281 )
10.
శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి. ( మను 8 - 282)
11.
బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. ( 8 - 283 )
12.
శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. (మను 4 - 99 )
13.
బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. ( మను 2 - 31 )
14.
బ్రాహ్మణున్ని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. ( మను 9 - 335 )
ఇలాంటి ఉదాహరణలు మనుధర్మ శాస్త్ర ఆధిక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థలో పైమూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల పెత్తనాన్ని తిరుగులేని విధంగా సూత్రీకరించిన మనుధర్మశాస్త్రం. శూద్ర, అతిశూద్ర కులాలను అంటరానివారుగా బానిసలుగా చిత్రీకరించింది. శూద్ర, అతిశూద్ర కులాలకు స్వర్గప్రాప్తి కలగాలంటే బ్రాహ్మణులకు సేవ చేసుకోవాలని నిర్ధారించింది. ఈ శ్లోకాన్ని చూడండి!
“స్వర్గార్థ ముఖయార్థం వా విప్రానారాధయేత్తు ప్ణ జాత బ్రాహ్మణశబ్దస్య సాహ్యస్య కతకత్యతా?”
బహుజనులు, పైమూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు గుణదోషాలెంచక శుశ్రూష చేసి జీవనం సాగించాలనే నియమాన్ని విధించింది.
'ఏకమేవతు శూద్రస్య ప్రభు: కర్మ సమాదిత్ ఏతేషామేవ వర్ణానాం శశ్రూషా మనసూయయా?”
శూద్రులు, అతిశూద్రులు ఎప్పటికీ వెట్టిచాకిరి చేసే వారిగానే ఉండాలి తప్ప, విద్య (నశూద్రాయా మతిందద్యాత్), జ్ఞానం, డబ్బు సంపాదించరాదు.
“శక్తేనా పిహి శూద్రేణ న కార్యో ధన సంచయ: శూద్రోహి ధన మాసాద్య బ్రాహ్మణానేవ బాధ్యతే?”
ఒకవేళ ఈ నియమాన్ని పాటించకుంటే వారి చెవుల్లో సీసం పోసి, నాలుకలు తెగకోయాలని (జిహ్వాయా వూపాప్నుయాచ్ఛే దం) నిబంధీకరించింది.
కేవలం శూద్రులనే కాక స్త్రీలను కూడా కడు హీనంగా, స్వాతంత్య్ర హీనులుగా, అబలలుగా, పురుషుడికి భగవంతుడు ప్రసాదించిన అందమైన వస్తువులుగా, తమ సేవకులుగా ఉండి తరించాలని, వెట్టిచాకిరిని సామాజిక నిష్టం చేసి పూర్తి స్థాయిలో స్త్రీలను అణచివేసిందీ ఈ మనుస్మతి గ్రంథమే.
మనుధర్మశాస్త్రం మనుషులను విడదీసి నిచ్చెనమెట్ల అసమాన కులవ్యవస్థ ద్వారా దళితులను పశువులకంటే హీనంగా చేసింది. మెజారిటీ ప్రజలైన బహుజనుల వెనుకబాటుతనానికి నూటికినూరు శాతం కారణమైంది. అందుకే బహుజన పితామహులైన ఫూలే మొదలుకొని కాన్షీరాం వరకు మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని పట్టుబట్టారు. అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనుధర్మ శాస్త్ర ప్రతిని తగులబెట్టారు.
స్వేచ్ఛను హరించి, అసమానత్వాన్ని పెంచి పోషించి, సౌభ్రాతత్వాన్ని హత్యచేసి అమానుషమైన కులదొంతర సమాజానికి మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని తగులబెట్టడం నేటికీ సమంజసమే అనిపిస్తున్నది.
ఈ కుల నిర్మూలన జరగనంతకాలం 'మనుస్మతి దహన దినం' పాటించవలసే ఉంటుంది. మతం పేరుతో, ఈ మనుధర్మం పేరుతో శూద్రులపై జరిపిన దుర్మార్ఘాలు ఇన్నీ అన్నీ కావు. అలా శాసించి అమలుపరచిన మతం పవిత్రమైనదిగా భావించాలా లేక అమానుషమైనదిగా పరిగణించాలా ?
- జంగిటి వెంకటేష్
సెల్ :
9948567892
No comments:
Post a Comment