Friday, June 21, 2019

మనుస్మృతి ఎందుకు వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది?


మనుస్మృతి ఎందుకు వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది?
1 నవంబర్ 2018
'ఒక బాలిక వివాహానికి ముందు తండ్రి సంరక్షణలో, వివాహం తర్వాత భర్త సంరక్షణలో, భర్త మరణాంతరం పిల్లల సంరక్షణలో ఉండాలి. ఆడవాళ్లను ఎప్పుడూ స్వతంత్రంగా ఉంచరాదు'
అంటుంది మనుస్మృతిలో అయిదో అధ్యాయంలోని 148 శ్లోకం.

మనుస్మృతికి మహిళలపై ఎలాంటి అభిప్రాయం ఉందో అది స్పష్టంగా తెలియజేస్తుంది. దళితులు, మహిళల గురించి అలాంటి వాక్యాలు మనుస్మృతిలో చాలా ఉన్నాయి. వాటిపై ఎన్నాళ్లుగానో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ఇటీవల ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ''మనుస్మృతి గురించి ఎక్కువగా మాట్లాడితే దభోల్కర్కు పట్టిన గతే పడుతుంది'' అని బెదిరించారు. అయితే అలాంటి లేఖలకు తాను భయపడనని, తాను చేస్తున్న కార్యక్రమాలను ఆపబోనని ఆయన బీబీసీకి తెలిపారు.

''
అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టి, అందరికీ సమానమైన హక్కులున్న రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారు. అయిదువేల ఏళ్ల నాటి అభిప్రాయాలను నేడు అమలు చేయాలని చూస్తే దాన్ని మళ్లీ తగలబెడతాం'' అన్నారు.

గతంలో సంత్ తుకారాం, సంత్ జ్ఞానేశ్వర్ కన్నా మనువే గొప్పవాడని పేర్కొన్న హిందుత్వ ఛాందసవాది శంభాజీ భిడే వివాదం స్పష్టించారు.

మనుస్మృతి ఎన్నోఏళ్లుగా వివాదాలకు కేంద్రంగా ఉంది. ఇంతకూ అందులోని వివాదాస్పద అంశాలేమిటి?

వర్ణాంతర వివాహం: ఆఫ్రికా అబ్బాయి, ఇండియా అమ్మాయి.. అందమైన ప్రేమ కథ
సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
CHARUKESH RAMADURAI
మనుస్మృతిలో ఏముంది?
స్మృతి అంటే ధర్మశాస్త్రం. మనువు రాసిన ధర్మశాస్త్రాన్నే మనుస్మృతిగా పేర్కొంటున్నారు.

మనుస్మృతిలో మొత్తం 12 అధ్యాయాలు, 2, 684 శ్లోకాలు ఉన్నాయని చరిత్రకారుడు నరహర్ కురుంద్కర్ (1932-1982) తెలిపారు. మనుస్మృతిని తగలబెట్టడాన్ని తాను సమర్థిస్తానని ఆయన గతంలో అన్నారు.

''
దీనిని క్రీస్తు పూర్వం రెండు, మూడు దశాబ్దాలలో ప్రారంభించి ఉండొచ్చు.
1.          దీనిలో మొదటి అధ్యాయంలో నాలుగు శకాల గురించి, నాలుగు వర్ణాల గురించి, వారి వృత్తుల గురించి, బ్రాహ్మణుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.
2.          రెండో అధ్యాయంలో బ్రహ్మచర్యం గొప్పతనం గురించి, యజమానికి చేయాల్సిన సేవ గురించి పేర్కొన్నారు.
3.          మూడో అధ్యాయంలో వివాహ పద్ధతుల గురించి, పూర్వీకులకు చేయాల్సిన కర్మల గురించి రాసుకొచ్చారు.
4.          నాలుగో అధ్యాయంలో ఒక గృహస్థ ధర్మం గురించి, ఏమేం తినకూడదన్న దాని గూర్చి, 21 రకాల నరకాల గురించి వివరించారు.''
5.          ''ఐదో అధ్యాయంలో మహిళల బాధ్యతల గురించి,
6.          ఆరో అధ్యాయంలో సన్యాసి యొక్క విధుల గురించి,
7.          ఏడో అధ్యాయంలో రాజు బాధ్యతల గురించి,
8.          ఎనిమిదో అధ్యాయంలో నిత్య జీవితంలోని విషయాల గురించి, నేరాలు, న్యాయం మొదలైన వాటి గురించి,
9.          తొమ్మిదో అధ్యాయంలో వారసత్వ వివరాల గురించి,
10.    పదో అధ్యాయంలో వర్ణ సాంకర్యం గురించి,
11.    పదకొండో అధ్యయంలో పాపాల గురించి,
12.    పన్నెండో అధ్యాయంలో మూడు రకాల పుణ్యాలు, వేదాల ప్రాశస్త్యం గురించి వివరించారు'' అని కురుంద్కర్ తెలిపారు.

ఐన్స్టీన్లో జాత్యహంకార కోణం
బ్రిటిష్ వలస పాలనలోజాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
ARUN SANKAR/GETTY IMAGES

మనుస్మృతికి ఎప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది?
పంజాబ్ యూనివర్సిటీలో చరిత్రను బోధించే రాజీవ్ లోచన్, ''బ్రిటిష్ పాలకులు భారతదేశానికి వచ్చినపుడు ముస్లింలకు షరియా ఉన్నట్లు హిందువులకు మనుస్మృతి ఉందని భావించారు. అందువల్ల వాళ్లు దానికి అనుగుణంగా న్యాయ విచారణ చేపట్టేవారు. అంతేకాకుండా, కాశీలోని బ్రాహ్మణులు వాళ్లకు మనుస్మృతిని హిందువుల ధర్మగ్రంథంగా ప్రచారం చేయమని చెప్పారు'' అని తెలిపారు.




''
బుద్ధుని సంఘాలు ప్రాశస్త్యంలోకి వచ్చినపుడు బ్రాహ్మణులకు తమ ఆధిపత్యం తగ్గిపోతున్నట్లు తోచింది. బ్రాహ్మణుడే అధికుడు అన్న భావన ద్వారా దాన్ని అరికట్టడానికి వాళ్లు ప్రయత్నించారు.''

''
వర్ణాశ్రమం ప్రకారం ఒకే తప్పుకు బ్రాహ్మణులకు తక్కువ శిక్ష, ఇతర వర్ణాల వారికి తీవ్రమైన శిక్ష విధించేవారు. మనుస్మృతి ప్రకారం పురుషులు క్షేమంగా ఉంటేనే మహిళలు క్షేమంగా ఉంటారు. మహిళలకు మతపరమైన హక్కులు కూడా ఉండవు. మనుస్మృతిలో పేర్కొన్న అన్ని కార్యాలను ఆచరించడం ద్వారానే వాళ్లకు స్వర్గప్రాప్తి దక్కుతుంది'' అని రాజీవ్ లోచన్ తెలిపారు.

మనుస్మృతిని ఎవరు సవాలు చేశారు?
''మనుస్మృతి శూద్రులకు చదువుకునే హక్కును నిరాకరించింది. అప్పట్లో విద్య కేవలం మౌఖికం. అందువల్ల మనుస్మృతిలో ఏముందో బ్రాహ్మణులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే, బ్రిటిష్ వారి పాలనలో చట్టాల కారణంగా దానికి ప్రాధాన్యం లభించింది. విలియం జోన్స్ మనుస్మృతిని ఇంగ్లీషులోకి అనువదించారు. తర్వాతే అందరికీ దానిలో ఏముందో తెలిసింది.''

''
మనుస్మృతిని మొదట సవాలు చేసింది మహాత్మా జోతిబా ఫూలే. వ్యవసాయ కూలీలు, నిరుపేద రైతులు, ఇతర పేదవారు, సమాజంలో దోపిడీకి గురవుతున్నవారిని చూశాక ఆయన బ్రాహ్మణులను, వ్యాపార వర్గాలను తీవ్రంగా విమర్శించారు'' అని రాజీవ్ తెలిపారు.

డాక్టర్ అంబేద్కర్-మనుస్మృతి దహనం
1927, డిసెంబర్ 25 డాక్టర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని గతంలో కొలబా (నేటి రాయగఢ్) జిల్లాలోని మహద్లో మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టారు.

''
మనువు చతుర్వర్ణాలను ప్రవచించారు. వాటిని పవిత్రంగా కాపాడాలని వర్ణ వ్యవస్థను సమర్థించారు. మనువే వర్ణవ్యవస్థను సృష్టించాడని చెప్పలేం కానీ, దానికి విత్తనాలను నాటింది మాత్రం ఆయనే'' అని అంబేద్కర్ తన 'ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం'లో పేర్కొన్నారు.

మనుస్మృతిని వ్యతిరేకిస్తూ ఆయన 'శూద్రులు ఎవరు?', 'కుల నిర్మూలన' అన్న పుస్తకాలు కూడా రాశారు.

వర్ణవ్యవస్థలో మహిళలు, దళితులకు కనీస హక్కులను కూడా నిరాకరించారు. సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని నెలకొల్పడంతో సమాజంల వర్ణ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థలో మనం మారాలనుకున్నా ఒక కులంలోంచి మరో కులంలోని మారలేం అంటారు డాక్టర్ అంబేద్కర్.

''
వర్ణవ్యవస్థ ద్వారా మనువు కేవలం శ్రమను వేరు చేయలేదు. శ్రామికులను వేరు చేశారు'' అని అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రం శీర్షిక
కాన్షీరామ్
మనువాదులు (మనువు అనుచరులు), మూలనివాసులు
అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టడంతో దేశంలోని ఇతర చోట్ల కూడా దాన్ని అనుసరించారు. దీంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. అది స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగింది.

1970
లో కాన్షీరామ్ బామ్సెఫ్ (బీఏఎమ్సీఈఎఫ్)ను స్థాపించారు. సమాజం మనువాదులు, మూలవాసులుగా విడిపోయిందని ఆయన అన్నారు.

జేఎన్యూ ఫ్రొఫెసర్ వివేక్ కుమార్, ''సమాజంలోని కులాలు మనుస్మృతి ఆధారంగా ఏర్పడ్డవి, అందుకనే సమాజంలో అసమానతలు ఉన్నాయని కాన్షీరామ్ అనేవారు. అలా సమాజం సుమారు 6 వేల కులాలుగా విడిపోయి ఉంది'' అని తెలిపారు.

మనువాదాన్ని ప్రోత్సహించిన మూడు బృందాలు
మనుస్మృతిని సమర్థించే వాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. కొంతమంది మనుస్మృతిని ఎలా సమర్థిస్తారో నరహర్ కురుంద్కర్ వివరించారు.

''
మనుస్మృతి సమర్థకులు ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని అంటారు. ప్రజాపతి మనువు - భృగువుల సాంప్రదాయం నుంచి ప్రాపంచిక విధానం ఏర్పడిందని అంటారు. అందువల్ల అందరూ దానిని గౌరవించాలని ఒక బృందం అంటుంది'' అని కురుంద్కర్ రాసుకొచ్చారు.

''
ఇక రెండోది - స్మృతులు వేదాల మీద ఆధారపడ్డాయన్నది. మనుస్మృతి వేదాల మీద ఆధారపడింది కాబట్టి దానిని గౌరవించాలి. శంకారాచార్యుడు దీని ఆధారంగానే మనుస్మృతిని సమర్థించారు.''

''
ఇక మూడో వర్గం ఆధునిక మనువాదులు. వీళ్లు ఆధునిక విద్యను అభ్యసించినా, ఏవో కొన్ని చిన్న మార్పులు తప్పించి, మనుస్మృతి సమాజ సంక్షేమం కోసమే అని అంటుంటారు'' అని కురుంద్కర్ తన పుస్తకంలో వివరించారు.

జైపూర్ హైకోర్టు ఎదుట మనువు విగ్రహం
'చట్టాన్ని రూపొందించిన మొదటి వ్యక్తి'

సంత్ తుకారాం, సంత్ జ్ఞానేశ్వర్లకన్నా మనువే గొప్పవాడని శంభాజీ భిడే అన్నారు. ప్రపంచ సంక్షేమం కోసమే మనుస్మృతిని రాశారని తెలిపారు.

మనువు చాలా గొప్ప న్యాయ పండితుడని, అందుకే రాజస్థాన్ హైకోర్టు ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారని కొందరు అంటారు.

దీనిపై రాజస్థాన్కు చెందిన దళిత కార్యకర్త పీఎల్ మీథరోత్ బీబీసీతో మాట్లాడుతూ, ''దీనిని జైపూర్ బార్ అసోసియేషన్ నెలకొల్పింది. రోజుల్లో బార్ అసోసియేషన్లో చాలా మంది లాయర్లు ఉన్నత కులాలుగా చెప్పుకునే వారుండేవారు. వాళ్లంతా మనువు విగ్రహాన్ని నెలకొల్పాలని పట్టుబట్టారు. మొట్టమొదట చట్టాలను గురించి రాసింది ఆయనే కాబట్టి ఆయన విగ్రహాన్ని నెలకొల్పామన్నది వాళ్ల వాదన'' అని వివరించారు.

సనాతన సంస్థ కూడా మనుస్మృతిని సమర్థిస్తుంది. సంస్థ 'మనుస్మృతిని తగలబెట్టాలా లేక అధ్యయనం చేయాలా?' అన్న పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించింది.

జర్మన్ తత్వవేత్త నీషే కూడా మనుస్మృతి చేత ప్రభావితులయ్యారని సంస్థ అంటోంది. దానిలో వర్ణవ్యవస్థను గురించి పేర్కొనలేదని చెబుతోంది.

నరహర్ కురుంద్కర్
'ఆధునిక విద్య ఆధునిక బుద్ధిని ఇవ్వలేదు'
''ఆధునిక విద్య ప్రజలకు ఆధునికమైన బుద్ధిని ఇవ్వలేదు. ఆలోచనను పెంచడానికి బదులుగా ఆధునిక విద్య సంప్రదాయాలను సమర్థించుకోవడానికి, కొత్తగా వాదించడానికి ఉపయోగిపడింది. అందువల్లే వాళ్లు ఇంకా సంప్రదాయవాదులుగా, ఛాందసవాదులుగా మిగిలిపోతున్నారు'' అని కురుంద్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

''
ఇలాంటి వారంటే డాక్టర్ అంబేద్కర్కు చాలా కోపం. ఇలాంటి ఛాందసవాదుల ఆలోచనను మార్చడంలో ఆధునిక విద్య విఫలమైందని ఆయన భావించారు. దానికి భిన్నంగా సంప్రదాయవాదులు ఆధునిక విద్యను ఒక ఆయుధంగా మలచుకున్నారనేది ఆయన వాదన. వీళ్లే నేడు వర్ణవ్యవస్థను సమర్థిస్తున్న వంచకులు అని అంబేద్కర్ భావించారు'' అని కురుంద్కర్ రాశారు.

No comments:

Post a Comment