Monday, September 30, 2019

Debate on Love and Hatred

 Debate on Love and Hatred

A.m. Khan Yazdani Danny
1 అక్టోబరు 2019

మనం ఆశించే సమాజాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రేమించాల్సినవాటిని ప్రగాఢంగా ప్రేమించాలి; ద్వేషించాల్సినవాటిని తీవ్రంగా ద్వేషించాలి.

ప్రగాఢంగా ప్రేమించడం, తీవ్రంగా ద్వేషించడం తెలిసినవాళ్ళే తమ కాలపు సమాజం మీద గొప్ప ప్రభావాన్నీ వేయగలరు. లక్ష్యాలను సాధించగలరు.

Kusuma Gundra
Dvesham leni prema undada.... I don't accept it... I love my solitude.. But I love someone too... To love someone is not the paradox of hating solitude

A.m. Khan Yazdani Danny
తమ కాలపు సమాజం మీద గొప్ప ప్రభావాన్నీ వేయాల్సిన వాళ్ల గురించి  నేను రాసిన మాటలవి. మరీ ముఖ్యంగా నాయకత్వం వహించాల్సిన వాళ్ల గురించి రాసిన వాక్యం అది.   సామాన్య మానవులు దృగ్విషయాలలోని పరస్పర విరుధ్ధ అంశాలను అంతగా  గమనించరు. ఎవరయినా గుర్తు చేసినా కూడ దాన్ని భావోద్వేగ అంశంగానో వ్యక్తిగత అధిక్షేపణగానో  భావించి సమస్యను మరింత జటిలం చేస్తారు. పగలు రాత్రి, శ్వాస నిశ్వాస, ప్లస్ మైనస్, యుధ్ధమూ శాంతి, జీవితం మరణం, ప్రేమ ద్వేషం,  పాతివ్రత్యం వ్యభిచారం, శ్రామికులు యజమానులు  ... ఈ సృష్టిలో  ప్రతిదీ వైరుధ్యాల  సమాహారమే. 

Vageeshan H విపరీతం అయిన ప్రేమ ,ద్వేషము రెండూ గొప్ప నాయకత్వాన్ని ఇవ్వవు. దేనిమీద ఎంత ప్రేమ దేని మీద ఎంత ద్వేషం , ఎప్పుడు, ఎట్లా అని ఎరగడమే నాయకత్వం. గాఢ ప్రేమ, గాఢ ద్వేషం నిరంకుశులను తయారు చేస్తుంది. తీసుకున్న పని పట్ల శ్రద్ధ, నిరంతర పరిశీలన, అవసరం అయినప్పుడు పట్టు విడుపూ ఉన్న వారే చరిత్ర లో విలువ గల మార్పుకు ఒక మేరకు తోడ్పాటును అందించారు. గాఢ ప్రేమా, గాఢ ద్వేషుము అనేవి స్వల్ప కాలం గా మాత్రమే మంచివి గా ఉండగలవు. దీర్ఘ కాలం లో అవి వినాశనం కరం.

Bhargava G 
అసలు మానవుడు జంతువునుండీ వేరైందే ఈ లక్షణం వల్ల అంటాడు మార్క్స్.
తన మనుగడకు అవసరమైనవన్నీ తనకు బయట వున్నాయనే ఎరుక వల్ల మనిషి వేదనా భరిత ప్రతిచర్య మాత్రమే చేసే జీవి (a suffering and passive being) అని లుడ్విగ్ ఫ్యూయర్ బా అన్నప్పుడు ఆ వ్యాఖ్యానం పై నిప్పులు చెరిగిన మార్క్స్ ఏమంటాడంటే ......

ఆ బాహ్య జగత్తును అర్థం చేసుకోవడానికీ , తనలో లీనం చేసుకోవడానికీ తీవ్రంగా తపించే క్రియాశీల జీవి (a passionate and active being) మానవుడని గర్జిస్తాడు. 

The passivity of early humans very quickly transforms into passion to know and transform his surroundings. In his effort to understand and transform the world ,humans understand and transform themselves. That's how human history rolled on. Human civilization evolve. Ethics and aesthetics mature. Old Social institutions are burst asunder from within. Love and hate are the two most common expressions of this passion, 

Marx was highliting. 

All the poets, artists and great leaders know the power and role of passions in moulding history.

Vageeshan H 
ఫ్యూయర్ బాఖ్ అనే మార్క్స్ గురు స్థానం లోగల తత్వవేత్త మనిషి వేదనా భరితజీవి అంటే మార్క్స్ అది తప్పు అని మనిషి క్రియాశీలజీవి అని అన్నాడు. 

మనిషి పరిణామం చెందుతూ ఉండే జీవి. ఆది మానవుడు ప్రకృతి పట్ల (భయంతోనో అవగాహన లేమితోనో ) క్రియాశీలంగా లేడు. కానీ పరిణామము చెందుతున్న మానవులు  ప్రకృతిని అర్థం చేసుకోవాలన్న బలమైన కాంక్ష, మోహాలవల్ల త్వరగానే  తమ పరిసరాలను తమకు అనుగుణం గా మార్చుకుంటారు. ఈ పని లో భాగం గానే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం దాన్ని మార్చడం కూడ జరుగుతుంది. అంతేకాక ఆ పని లో భాగం గానే తమను తాము అర్థం చేసుకోవడం మార్చుకోవడం కూడా జరుగుతుంది.   

మనవ నాగరికత పరిణామం చెందుతూ ఉండే లక్షణం కలది. నైతికత , సౌందర్య దృష్టి ( కళాదృష్టి ) పరిణితి చెందుతాయి . పాత వ్యవస్థలు ముక్కలు చెక్కలు అయిపోతాయి.  ఈ విస్పోటనానికి కారణాలు ప్రధానంగా వ్యవస్థ లోపలివే  అయి ఉంటాయి. బలమైన కాంక్షకు రెండు అతి సాధారణ రూపాలు ద్వేషమూ, ప్రేమా  అంటాడు మార్క్స్ . 

గొప్ప కవులు, కళాకారులు, నాయకులు చరిత్రను మలుపు తిప్పడం లో (మనిషి కి ఉండే సహజ లక్షణం ఆయిన ) బలమైన కాంక్ష, మోహాల పాత్ర గురించి బాగా  తెలిసన వాళ్ళే అయి ఉంటారు. 

ఇదన్నా అక్కడ ఇంగ్లీషుకు కొంత వీలు ఉన్న తెలుగు అను వాదం. నమస్కారాలు

A.m. Khan Yazdani Danny
మార్ క్స్ ను ఎవరయినా కోట్ చేసినపుడు నాకు ఒక రకం పులకరింత కలుగుతుంది. Thank you, 





No comments:

Post a Comment