Division of India Time Line
తెలుగువాడు
శ్రీనివాసు
దేశవిభజనకి
మూలం Lord Curzon,
Sir Aga Khan, Illama Iqbal, Inayat Ali, Jinnah, Mr Churchill and Gandhi.
1.
ముస్లింల
కోరికపై ముస్లిం మెజారిటీ ఎక్కువుగా వున్న తూర్పు బెంగాల్ ను వాళ్లకిచ్చి 1905 లో లార్డ్
కర్జన్ బెంగాల్ ను విభజించి దేశవిభజనకు
నాందిపలికాడు.
2.
భారతదేశంలోని
35 ప్రాంతాలలోని 35 మంది ముస్లిం నాయకుల ప్రతినిధి బృందం ఆగాఖాన్ III నాయకత్వంలో కలుసుకుని 1909 లో లార్డ్ మింటోను
ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రాల విషయాన్ని చర్చించింది.
3.
తరువాతి
పాత్ర ముస్లింలీగ్ ది. దాని అసలు లక్ష్యమేమంటే భారతీయ ముస్లింలలోని విద్యావంతుల, కులీన వర్గాల ప్రయోజనాలను రూపొందించి, సంరక్షించడం. తమ అసలు లక్ష్యాన్ని
కప్పిపుచ్చడానికి వారు ఏ సిగ్గూ లజ్జా
లేకుండా మిగిలిన 90 శాతమంది బడుగు, బలహీనవర్గాల ముస్లింల సెంటిమెంట్లను వాడుకున్నారు.
4.
పాకిస్తాన్
అనే భావన వెనుకవున్న సైద్ధాంతిక ప్రాతిపదిక రూపకర్త అలమా ఇక్బాల్. అతడు 1929 లో బ్రిటన్ లో
జరిగిన ముస్లింలీగ్ సమావేశంలో మొదటిసారిగా పాకిస్తాన్ అనే భావనని ప్రతిపాదించాడు.
5.
‘పాకిస్తాన్’ అనే
పేరును సృష్టించిన ఘనత ఛౌదురీ రహ్మత్ అలీది. అతడు 1933 లో పాకిస్తాన్ రూపొందే
ఉద్యమానికి అంకురార్పణ చేసాడు. అతడు సుప్రసిద్ధమైన ‘పాకిస్తాన్ డిక్లరేషన్’ గా
పిలువబడే కరప్రతం “"Now or
Never; Are We to Live or Perish Forever" ను
1933 లో రూపొందించాడు. ఆ కరపత్రం ఈ
ప్రఖ్యాత ప్రకటనతో ప్రారంభమవుతుంది. "At
this solemn hour in the history of India, when British and Indian statesmen are
laying the foundations of a Federal Constitution for that land, we address this
appeal to you, in the name of our common heritage, on behalf of our thirty
million Muslim brethren who live in PAKSTAN – by which we mean the five
Northern units of India, Viz: Punjab, North-West Frontier Province (Afghan
Province), Kashmir, Sindh and Baluchistan."
6.
ఇంకా
అతడు ముస్లింలకు ప్రత్యేక దేశాలను, అంటే పశ్చిమాన పాకిస్తాను, తూర్పున బంగిస్తాన్, దక్షిణాన ఉస్మానిస్తాన్ ఏర్పాటుకోసం ప్రతిపాదించాడు. ద్విజాతి సిద్ధాంతానికి మొట్టమొదగా అంకురార్పణ చేసిన రాజకీయనాయకుడు రహ్మత్ అలీ. అంటే ముస్లింలు ఒక ప్రత్యేక దేశంగా,
భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, కులాలు, మతాల నుండి రాజకీయ స్వాతంత్ర్యం పొందడం అన్నమాట.
7.
అక్కడనుండి
ఆ ఉద్యమాన్ని జిన్నా తలకెత్తుకున్నాడు. తనకప్పటికే వున్న రాజకీయ అనుభవ, పలుకబడి చట్రం ఆ నాయకత్వాన్ని పళ్లెంలో
పెట్టి అతడికి అప్పగించింది. అతడికి బ్రిటిష్ వారితో, కాంగ్రెస్ తో వున్న సత్సంబంధాలు
తన లక్ష్యానికి ఫలితాలనివ్వడం ప్రారంభించాయి.
8.
బ్రిటిష్
పార్లమెంట్ 1935లో చేసిన భారత
ప్రభుత్వ చట్టంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు గణనీయమైన అధికారాలిచ్చింది. కానీ, అధికారాలన్నీ వైస్రాయి చేతుల్లోనే పెట్టింది. అతడు ఏ రాష్ట్రప్రభుత్వాన్నయినా ఎప్పుడైనా రద్దుచేసి, తన డిక్రీ ద్వారా
స్వయంగా పరిపాలించడవచ్చు. 1937 లో ఆయా రాష్ట్రాలకు
జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అన్నింటిలోనూ ఘనవిజయం సాధించి ప్రభుత్వాలనేర్పరచింది. ముస్లింలు ఎక్కువగా వున్న రాష్ట్రాలలో కూడా ముస్లింలీగ్ అధిక స్థానాలు సాధించలేక తన ప్రభుత్వాలను ఏర్పరచలేకపోయింది.
9.
ఆ
దెబ్బతో జిన్నా, ముస్లింలీగ్ కళ్లు తెరపినబడి తమ రాజకీయ భవిష్యత్తు
గురించిన భ్రమలు తొలగాయి. తరువాత రెండేళ్లలో 1939 వరకు ముస్లింలీగ్ కు ముస్లింలలో మద్ధతు
కూడగట్టడానికి కృషిచేసాడు. తూర్పు బెంగాల్ రాష్ట్రం లోని ముస్లిం ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడటానికి హక్కుదారుడుగా స్థిరపడ్డాడు.
10. అప్పుడే మొదటి ప్రపంచయుద్ధం మొదలైంది. బ్రిటిష్ వారు, ముస్లింలు కొంతమేరకు సహకరించుకుంటున్న నేపథ్యంలో వైస్రాయ్ జిన్నాను భారతీయులు తమను తామే పరిపాలించుకునే విషయం గురించి అభిప్రాయం కోరాడు. కారణం, కాంగ్రెస్ అభిప్రాయంతో జిన్నా కచ్చితంగా విభేదిస్తాడన్న నమ్మకంతో. జిన్నా ఫిబ్రవరి 9, 1939 తేదీన, ‘1935 చట్టంలో చెప్పబడిన సమాఖ్యగా బదులు దేశ విభజనను ముస్లింలీగ్ డిమాండ్ చేస్తుంది’, అని వైస్రాయ్ తో చెప్పి కుండబద్దలు
కొట్టాడు.
11. 1940
మార్చి 23 న ముస్లింలీగ్ ‘లాహోర్
తీర్మానం’ ను
ఆమోదించింది. అది ద్విజాతి సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకుని, వాయవ్య భారతదేశంలోని ముస్లిం మెజారిటీ రాష్ట్రాల సమాఖ్యను ఏర్పరచి, వాటికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని యివ్వలసినదిగా కోరింది. అచ్చంగా అలాంటి హక్కులే తూర్పు భారతదేశంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు కూడా యివ్వాలని, ఇతర ప్రాంతాలలోని ముస్లిం మైనారిటీల రక్షణ చట్టాలు చేయాలని కోరింది.
12. కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, అధికారులందరినీ 1940 లో బ్రిటిష్ ప్రభుత్వం
జైల్లో పెట్టింది. ముస్లింలలోని సాధారణ ప్రజానీకానికి నాయకుడిగా ఆవిర్భవించేందుకు ఇది జిన్నాకు మంచి అవకాశంగా చేతికందింది.
13. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి, గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ, సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలు బ్రిటిష్ పాలకులను కకావికలం చేసాయి. బ్రిటన్ అప్పటికే ప్రపంచయుద్ధ కారణంగా బలహీనపడింది. దానితోబాటు భారతదేశం ఒక సంపదల భోషాణంగా
సొమ్ము పిండుకునే అవకాశం కూడా తగ్గిపోయింది. నిజానికి రానున్న కాలంలో భారతదేశం నుండి పొందే ఆదాయం కంటే భారతదేశాన్ని పాలించడానికి అధిక వ్యయం అవుతుందన్న సత్యాన్ని వాళ్లు ముందుగానే ఊహించగలిగారు.
14. ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం
రావ్వడం నిశ్చయమై పోయింది. చెఱసాల నుండి అప్పటికే విడుదలైన గాంధీజీ బొండాయిలోని మలబార్ హిల్ లో వున్న జిన్నా
ఇంటిలో కలిసి రెండు వారాల పాటు చర్చలు జరిపారు. కానీ, ఏ ఒప్పందానికీ రాలేకపోయారు.
బ్రిటిష్ వారు దేశాన్నుండి వైదొలగేలోగానే ‘పాకిస్తాన్’ అనేది
తక్షణం ఉనికిలోకి రావాలని జిన్నా భీష్మించాడు. గాంధీజీ ఏమో, సమైక్య భారతదేశం స్వాతంత్రం పొందిన కొంతకాలం గడచిన పిమ్మట ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణల ద్వారా దేశవిభజన జరగాలని కోరాడు. కానీ, ‘మేము ఉద్యమించే ఏకైక అంశం పాకిస్తాన్’ అని
ముస్లింలీగ్ ప్రకటించింది.
15. 1945
మే 5, అంటే యుద్ధంలో జర్మనీ లొంగిపోయినరోజునే, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలను కాపాడానికి దీర్ఘకాలిక విధానాన్ని గురించిన అంచనా ముసాయిదా తయారుచేయమని ఆదేశించాడు. వావయ్య దిశనుండి సోవియట్ సైన్య స్థావరాలను ఎదిరించడంలో భారతదేశానికి వున్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. అప్పుడు చర్చిల్ భారతదేశంలోని అప్పటి వైస్రాయ్ లార్డ్ ఆర్చ్ బాల్డ్ వేవెల్ కు భారతదేశంలోని ఓ
భాగాన్ని తమ చెప్పుచేత్లో వుండేలా
చేయమని చెప్పాడు. వేవెల్ 1946 ఫిబ్రవరి నాటికి దేశ విభజన సరిహద్దుల బ్లూ ప్రింట్ తయారుచేసాడు. కానీ, అతడు విజ్ఞుడైన అతడు ఈ సత్యాన్ని గ్రహించాడు.‘‘బ్రిటిష్ వారు మధ్యప్రాచ్యం, హిందూమహాసముద్ర ప్రాంతాలను రక్షించుకోడం ఈ దేశవిభజన జరిగితే
సాధ్యం కాదు. ఈ లోపం ముస్లింలీగ్
గనక ఈ వ్యూహాత్మక వాయవ్య
భారతాన్ని మిగిలిన సమైక్య భారత్ నుండి విడగొట్టగలిగితే పూరింపబడుతుంది. తనకంటే ముందు పనిచేసిన వైస్రాయ్ లార్డ్ లిన్ లిత్ గో కు జిన్నాతో
వున్న సన్నిహిత సంబంధాలు ఈ లక్ష్యం సాకారమవడానికి
బాగా ఉపకరిస్తాయి’.
16. ఈ ప్రతిష్ఠంభన తొలగించడానికై
బ్రిటిష్ ప్రభుత్వం దేశనాయకులతో చర్చిచండానికై క్రిప్స్, పెథిక్ లారెన్స్ లతో కూడిన మంత్రివర్గ సభ్యులను ప్రతినిధి బృందంగా 1946 లో భారత్ కు
పంపింది.
17. 20
ఫిబ్రవరి 1947 న బ్రిటిష్ ప్రభుత్వం
మౌంట్ బాటన్ ను నియమించి జూన్
1948 లోగా భారతదేశానికి అధికార మార్పిడి జరిగేట్లుగా నిర్దేశించింది. అప్పటికి కాంగ్రెస్ దేశ విభజన అనే ఆలోచనకు వచ్చింది.
18. దరిమిలా, ఈ ప్రతిష్ఠంభన తొలగే
మార్గంగా దేశ విభజన ప్రణాళిక ప్రతిపాదించబడింది. భవిష్యత్తులో రూపొందబోయే భారతదేశంలో అక్కడక్కడా వున్న ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు యిచ్చే స్వాతంత్రం వారు కోరుకునే బలమైన కేంద్రప్రభుత్వంతో పోలిస్తే పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన పనిలేదని వారు భావించారు. పరిణామక్రమంలో, పాకిస్తాన్ స్వతంత్రదేశంగా మారాలని, బెంగాల్, పంజాబ్లను విభజించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది.
19. మౌంట్ బాటన్ కు నెహ్రూతో వున్న
సాన్నిహిత్యాన్ని గురించి తెలుసుగనక జిన్నాకు అతడంటే విశ్వాసం లేదని చెప్పాడు. కాబట్టి, పంజాబ్, బెంగాల్ విభజన సరిహద్దు రేఖలు గీయమని ‘సిరిల్ ర్యాడ్ క్లిఫ్’ ను
కోరారు.
20. సిరిల్ ర్యాడ్ క్లిఫ్ నాయకత్వంలోని ‘సరిహద్దు కమిషన్’, ఇదే గనక జరిగితే ఇరుదేశాలకు చెందిన కోట్లాదిమంది జనాభా తరలవలసిన అవసరం వుంటుందని, దానివలన వేర్పాటువాద హింస ప్రబలుతుందని హెచ్చరించింది.
21. అదీ సంగతి. అప్పటినుండి మనం రెండు దేశాలుగా విడిపోయాం.
ఆగాఖాన్
III నాయకత్వంలో 1909 లో లార్డ్ మింటోని
కలుసుకున్న భారతదేశంలోని 35 ప్రాంతాలలోని 35 మంది ముస్లిం నాయకుల ప్రతినిధి బృందం. (అందరూ ముస్లిం అగ్రవర్ణంవారే, కులీనవర్గాలవారే వుండడం మీరు గమనించవచ్చు)
1.
Nawab Syed Sardar Ali Khan,
2.
Maulvi Rafeeuddin Ahmed,
3.
Ibraheem Bhai Adamjee Pirbhai (Bombay),
4.
Nawab Mohsin-ul-Mulk,
5.
Maulvi Habiburrehman Khan,
6.
Muhammad Muzammilullah Khan,
7.
Sahibzada Aftab Ahmed Khan,
8.
Khan Bahadur Haji Muhammed Ismail Khan
(Aligarh),
9.
Nawab Waqar-ul-Mulk. (Muradabad),
10. Maulvi
Hafiz Hakim Ajmal Khan. (Delhi),
11. Maulvi
Syed Karamat Husain,
12. Syed
Nabiullah, Syed Abdul Rauf. (Allahabad),
13. Maulvi
Sharifuddin,
14. Nawab
Sarfaraz Hussain Khan Bahadur,
15. Syed
Muhammed Imam,
16. Khalifa
Syed Muhammed Khan Bahadur,
17. Nawab
Nasir Hussain Khan Bahadur (Patna),
18. Abdul
Salam Khan (Rampur),
19. Raees
Muhammed Ahtasham Ali. (Lucknow),
20. Malik
Umar Hayat Khan Tiwana. (Shahpur),
21. Khan
Bahadur Muhammed Shah Deen,
22. Mian
Muhammad Shafi Khan Bahadur (Lahore),
23. Khan
Bahadur Syed Nawab Ali Chaudhary. (Mymansingh),
24. Nawab
Bahadur Mirza Shuja'at Ali Baig. (Murshidabad),
25. Khan
Bahadur Syed Ameer Hassan Khan,
26. Shehzada
Bakhtiar Shah,
27. Maulvi
Abdul Raheem (Calcutta),
28. Khan
Bahadur Ahmed Muhaeeuddin. (Madras),
29. Syed
Allahdad Shah. (Khairpur),
30. Maulana
H. M. Malik. (Nagpur),
31. Khan
Bahadur Col. Abdul Majeed Khan. (Patiala),
32. Khan
Bahadur Khawaja Yousuf Shah,
33. Khan
Bahadur Shaikh Ghulam Sadiq(Amritsar)
No comments:
Post a Comment