Friday, September 20, 2019

Merger of Nizam - Time Line

నిజాం సంస్థాన విలీనం – అసలేం జరిగింది ?? – నాటి నిజాం రాజ్యంలోని పరిస్థితులేమిటి //
.
… “నిజాం సంస్థానాన్ని” ఇండియా యూనియన్” లో చేర్చుకోవడం….
=> ఇది విలీనామా ?
=> విమోచనామా ?
=> విద్రోహమా ?
=> స్వాతంత్రమా  ?
.
… రంగురంగుల రాజకీయులు రకరకాల మాటలు చెబుతున్నారు.. ఏది సత్యమో – ఏది అసత్యమో సామాన్యుడికి అర్థం కాక తలపట్టుకొంటున్నాడు. – … ఏది నిజం ?
.
=> అసలు సత్యం తెలవాలంటే, చారిత్రక సత్యాలను తెలుసుకోవాలి..
=> ఈ వ్యాసంలో నేను పేర్కొన్నవన్నీ చారిత్రక వాస్తవాలే.. ఏవీ కల్పితం కాదు..
=> వ్యాసం కాస్త పెద్దదే….. ఓపిక చేసుకొని చదివితే పైన పేర్కొన్న ప్రశ్నలన్నింటికీ “సందిగ్డతకు తావులేని సమాధానం” దొరుకుతుంది.

Map of Hyderabad.jpg.
>> బ్రిటిష్ వాడు దేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు “ఇండియా – పాక్” అనే రెండు దేశాలుగా చేసి, అనేకానేక సమస్యలకు భీజంవేసి వెళ్లారు. అలాంటి అనేక సమస్యల్లో ఒకటి, “తామరతంపరగా ఉన్న 500 పైచిలుకు “సంస్థానాలకు స్వాతంత్ర్యం ఇవ్వడం”. దీనివల్లనే “కాశ్మీర్ నేటికీ రగులుతూనే ఉంది”..
.
>> ఇక, హైదరాబాద్ సంస్థానానిది మరొక పెద్ద సమస్య.. ఈ నిజాం రాజు ఒక పెద్ద బెడద. “కొంపలు కాలుతూ ఉంటే, వాసాలు పీక్కోవాలనుకొనే తత్వం ఈ నిజాముది”. బ్రిటిష్ వాడికి విధేయుడై, వారికి శిస్తు కడుతూ, వారి కనుసన్నల్లోనే తన రాజ్యాన్ని పాలించుకొంటూ ఉన్న ఈయనకు, బ్రిటిష్ వాడు నిష్క్రమించాక తిరిగివచ్చిన తన సార్వభౌమత్వాన్ని అడ్డుపెట్టికొని మరిన్ని సమస్యలు సృష్టించాలనుకొన్నాడు. తగలబడుతున్న స్వతంత్ర భారతదేశంలో, వాసాలు పీక్కోవాలన్న పన్నాగం పన్నాడు.
.
… తన సంస్థానాన్ని “ఇండియన్ యూనియన్” లో విలీనం చేయకుండా, కుతంత్రాలు పన్నడం మొదలుపెట్టాడు.
.
>> అప్పటికే, ఒకటిన్నర శతాబ్దంగా బ్రిటిష్ ఇండియా సైన్యాలు సికిందరాబాద్ లో ఉంటున్నాయి. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఉన్నాయి. అప్పటికి సుమారు 1400 సైన్యం ఉంది. వీటిని మించి మందుగుండు గోడౌనులు కూడా ఉన్నాయి. వాటిమీద దాడికి “ఖాసీం రిజ్వీ” అనేకసార్లు దాడికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. నిజాం తో భారత ప్రభుత్వం కుదుర్చుకొన్న “యధాతథ ఒప్పందం – Standstill Agreement” ప్రకారం సేనలను ఉపసంహరించుకోవడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 1948 జనవరి నుండి ఏప్రిల్ వరకూ ఉపసంహరించింది.

Stand Still Agreement.jpg.
>> నిజాం నవాబు సైన్యాలు పెరుగుతున్నాయనీ – నిజాం తన బలం పెంచుకొంటున్నాడనీ పుకార్లు బయలుదేరాయి. పాకిస్థాన్ లో ఐదు లక్షల మందిని నిజాం రిక్రూట్ చేశాడని మద్రాస్ ప్రధాని “రెడ్డియార్” ప్రకటించాడు. నిజాం సేనలు దాడిచేస్తే తన రాష్ట్రానికే ప్రమాదం వాటిల్లవచ్చునని భయపడ్డాడు. దొంగచాటుగా “సిడ్నీ కాటన్”ఆయుధాలు చేరవేస్తున్నాడు. విదేశాల్లో ఆయుధాలు కొనడానికి నిజాం ప్రయత్నిస్తున్నాడు.
.
>> వీటన్నిటితో దేశంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 1948 జనవరిలో సైన్యాన్ని హెచ్చరించింది. “హైదరాబాద్ సైన్యాలు భారతదేశం మీద దండెత్తే వీలు లేకుండా చూడాల్సిందని, అందుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందని 1948 జనవరి 20 వ తేదీన సైనిక ప్రధాన కార్యాలయం సదరన్ కమాండ్ ను ఆదేశించింది”. “హైదరాబాద్ సైన్యానికి దాడిచేసే శక్తి లేదని” సదరన్ కమాండ్ వారు నివేదిక అందించారు.
.
>> 1948 ఫిబ్రవరి లో ఈ ప్రణాళికకు “పోలో” అని నామకరణం చేశారు. సైనికులు తమ వ్యూహాలకు పేర్లు పెడతారు. హైదరాబాద్ “పోలో” అనే ఒక క్రీడకు ప్రసిద్ధి. అందువల్ల దానికి “పోలో” అనే పేరు పెట్టారు. “పోలో” ఆటలా సైనిక చర్య జరుపుతామని ఆ పేరు పెట్టారు.

.
… ఆనాటినుండీ, భారతదేశం లో అనుకూలంగానూ – నిజాం రాజ్యంలో వ్యతిరేకంగానూ పరిణామాలు సంభవించాయి.
.
[ భారతదేశానికి అనుకూల పరిణామాలు ]

 విభజనవల్ల కలిగిన రక్తపాతం అంతమయ్యింది. పరిస్థితులు అదుపులోకొచ్చాయి.
పాకిస్థాన్ ప్రణాళికలను భగ్నం చేయడం వలన, కాశ్మీర్ పరిస్థితి కూడా మరీ అల్లకల్లోలంగా లేదు
దేశం మొత్తం మీదా ఉన్న సంస్థానాలన్నీ ఆల్మోస్ట్ భారత యూనియన్ లో విలీనమైపోయాయి.
“జునాగడ్” పాకిస్థాన్ సరిహద్దు సంస్థానం. “జుల్ఫికర్ ఆలీ బుట్టో” జన్మస్థానం. అక్కడ భారతదేశంలో విలీనాన్ని గురించి రెఫరెండం జరిగింది. భారతదేశంలో విలీనానికి అనుకూలంగా 222304 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 150 మాత్రమే ఓట్లు వచ్చాయి.
స్వాతంత్రం లభించిన ఆరు నెలలకు ప్రభుత్వం స్థిరపడింది. అంతర్జాతీయ సమాజం భారత్ స్థిరతను గుర్తించింది.
మిగిలిన ఒక్క హైదరాబాద్ సమస్యను పరిష్కరించగలిగే శక్తిస్తోమతలను భారత్ సమకూర్చుకోంది.
[ నిజాం రాజ్యానికి ప్రతికూల పరిస్థితులు ]

నిజాం బడ్జెట్ 2.25 కోట్లకు చేరుకొంది. ఇది బడ్జెట్ లో కనబరచిన సంఖ్య మాత్రమే. పరిస్తితి ఇంతకంటే అధ్వాన్నంగా ఉంది. ఇది భారత ప్రభుత్వం విధించిన దిగ్బంధం ఫలితం.
ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాల కారణంగా గ్రామాధికారులు గ్రామాలు వదిలారు. ఫలితంగా రెవెన్యూ వసూళ్లు ఆగిపోయాయి.
వర్తకులు రజాకార్ల భయానికి రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. వ్యాపారం సుమారు నిలిచిపోయింది. వ్యాపారం ఆగిపోవడం వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయింది. బాధలు ఎక్కువవ్వడం వలన, ప్రజలు కూడా వలసలబాట ఎంచుకొన్నారు.
భారత్ దిగ్బంధం చేయడంవలన సరుకుల రాకడ తగ్గిపోయింది. దీంతో, కస్టమ్స్ ఆదాయం కూడా బాగా తగ్గిపోయింది.
సుమారు లక్షమంది రజాకార్లను పోషించాల్సిన పరిస్థితి
ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి పోలీస్ – మిలిటరీ ఖర్చు తలకుమించిన భారమయ్యింది.
శాంతిభద్రతలు క్షీణించాయి. ధన – మాన -రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
ఉన్న ప్రభుత్వం “నిజాముదో” లేక “ఖాసీం రజ్వీ”దో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కీలక నిర్ణయాల్లో సైతం రజ్వీ పెత్తనమే నడిచింది.
ఈ సందర్భంలో, నిజాం ప్రధాని “లాయక్ అలీ” ఇండియా గవర్నర్ జనరల్ “మౌంట్ బాటన్” తో ఒక అంగీకారానికి వచ్చాడు. దాన్ని ధృవీకరించుకోవడానికి హైదరాబాద్ వస్తే, ఆ ఒప్పందానికి “రజ్వీ” ఒప్పుకోలేదు. నిజాం మాత్రం అశక్తుడై మిన్నకున్నాడు.
నాయకత్వలేమితో తమ విధులు నిర్వర్తించడం అధికారులకు అసాధ్యమయ్యింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం స్తంభించిపోయింది. అసలు ప్రభుత్వమే పట్టా లేకుండా పోయింది.
కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో ప్రజలే గ్రామాలను వశపరచుకొన్నారు. వారే పాలించుకొనే ప్రయత్నం చేశారు. యధావిధిగా ప్రజలను దోచుకోవడానికి రజాకార్ల ముఠాలు మాత్రం అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉన్నారు. – వాళ్ళే ప్రభుత్వం అనుకోవాలేమో..!
కాంగ్రెస్ వాళ్ళు సరిహద్దుల్లో సాయుధ క్యాంపులు నెలకొల్పారు. హైదరాబాద్ శాసనసభలో పోలీసు మంత్రి ప్రకటనను అనుసరించి బొంబాయి సరిహద్దులో 23 కేంద్రాలు – మద్రాసులో 21 – మధ్య పరగణాల్లో 4 క్యాంపులూ ఉన్నాయి. వారు సుమారు 400 దాడులు చేశారు.
1948 ఫిబ్రవరిలో “ఉమ్రీ” పట్టణంలోని “హైదరాబాద్ స్టేట్ బ్యాంక్” లూటీ జరిగింది. 22 లక్షలా 60 వేల రూపాయల దోపిడీ జరిగింది. ఈ చర్యలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. (ఈచర్యను సోషలిస్ట్ పార్టీ అభిమానం గల కాంగ్రెస్ వాళ్ళు చేశారని చెప్పుకొంటారు. అందులో చాలావరకూ ప్రజా పోరాటానికి ఖర్చు చేసి, మిగతా ధనంతో “గాంధీ భవన్” ను నిర్మించారని చెప్పుకొంటారు. )
.
… ఇలా ఎన్నో లెక్కలేనన్ని సమస్యలతో, సంక్షోబంలో కూరుకొన్న నిజాం రాజ్యం, రజాకార్ల దాష్టీకాలతో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇక “నిజాం” అతని తాబేదారు “రజ్వీ” అయితే తమ రాజ్యం మాత్రం తమకు కానేతీరాలి అన్న పిచ్చిలో పడిపోయారు. సామాజిక – ఆర్థిక – రాజకీయ తదితర కారణాలు వాళ్ళకు లేషమాత్రం కూడా అర్థంకావడం లేదు. ఇక కాలంతో బాటు మారాలన్న బుఱ్ర వాళ్లకెక్కడిదీ ??
.

khasim-rijvi2nizam-army-2rajakars
>> ఇకపోతే, ఇండియా కు “గవర్నర్ జనరల్” గా ఉన్న “మౌంట్ బాటన్” ఈ “నిజాం”కు శ్రేయోభిలాషి. అతడు 1948 జూన్ 25 వ తేదీన పదవిని విరమిస్తాడు. ఈలోగా ఉభయులకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని వారి తాపత్రయం. ఈ నేపథ్యంలోనే నిజాం ప్రధాని అయిన “లాయక్ అలీ” కి 5గంటల అపాయింట్మెంట్ ఇచ్చాడు “మౌంట్ బాటన్”. ఆయన భారతదేశంలో ఉన్న ఇన్ని నెలల్లో ఇన్ని గంటలు ఏ ఇతరులతోనూ, ఇంత సుదీర్ఘంగా మాట్లాడలేదు. హైదరాబాద్ క్షేమం భారతదేశంలో కలిసి ఉండడమేనని ఆయన స్పష్టం చేశాడు. ఐనా సరే, నిజాం తన మొండి పట్టు వదలలేదు. బాధ్యతాయుయమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాడు. – ప్రధాని “లాయక్ అలీ” అర్థం చేసుకొన్నాడు.
.

last-prime-minister-of-hyderabad-state-mir-laik-alilayak-ali
>> 1948 మే 26 న “మౌంట్ బాటన్” – “జవహర్ లాల్ నెహ్రూ” – “వి.పి. మీనన్” – “లాయక్ అలీ” కలిసి సమావేశమయ్యారు. ఒక ముసాయిదా సిద్ధమయ్యింది. “లాయక్ అలీ” కి ఆమోదయోగ్యమయ్యింది. ఆమోదముద్రకోసం హైదరాబాద్ చేరుకొన్నాడు. “ఖాసీం రజ్వీ” ని కలిశాడు. ఆ ఒప్పందానికి రిజ్వీ ససేమిరా అన్నాడు. ఒప్పుకోలేదు.

mountbattenqasim-rajvi-operation-polo-hyderabad-police-action-1948-photos-31
.
>> ఇకపోతే, నిజాం.. తొలుత, తన ఆంగ్ల సలహాదారును “మౌంట్ బాటన్” ను సంప్రదించాలన్నాడు. మౌంట్ బాటన్ అంగీకరించాడు. మంత్రిమండలిని సంప్రదించాలన్నాడు. శాసనసభను సంప్రదించాలన్నాడు. … ఇన్ని చేశాక కూడా..
.
… చివరికి “ఇండియాతోనే కలిసి ఉండాలన్న” ఈ ప్రతిపాదనను నిజాం తిరస్కరించాడు.. తనను తానే కూల్చుకొన్నాడు.
.
>> ఇదిలా ఉండగా, “యధాతతపు ఒడంబడిక – Standstill Agreement” ను నిజాం ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదనీ, – ఈ ఉల్లంఘనలను ఆపకపోతే తాము గట్టి చర్య తీసుకోవలసి వస్తుందనీ, భారత ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. “నిజాం ప్రభుత్వం” అదిరింది… ఐనా సరే, “మేకపోతు గాంభీర్యాన్ని” ప్రదర్శించింది.
.
>> “ఖాసీం రజ్వీ” రంగప్రవేశం చేశాడు. హైదరాబాద్ రాజ్యం రక్తసిక్తం అవుతుంది – భారతదేశాన్ని చెరిపేస్తాం – చివరి రక్తపుబొట్టు దాకా చిందిస్తాం – ఎర్రకోటమీద “అసఫ్జాహీ జెండా” రెపరెపలాడుతుంది – మా కరవాలాలు బంగాళాఖాతంలో కానీ కడగం” లాంటి తన ట్రేడ్ మార్క్ డైలాగులను పేల్చాడు.. తన వాగాడంబరంతో బెదిరింపులకు పూనుకొన్నాడు.

Rajvi.JPG.
…. ఇక్కడ ఈ “రజ్వీ” వాగాడంబరం ఇలా ఉండగా, అక్కడ భారతదేశంలో “వల్లభాయి పటేల్” పూర్తి ఆధీనంలో పకడ్బందీగా “ఆపరేషన్ పోలో” సన్నాహాలు పూర్తయ్యాయి. నెహ్రూ గారికి కూడా ఏమేమి చేయనున్నారో పూర్తిగా తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు.
.
>> 1948 ఏప్రిల్ 6 న “జనరల్ అటల్” అంచనా ప్రకారం సైన్యం రోజుకు 30 మైళ్ళు పురోగమించడం సాధ్యపడుతుంది. హైదరాబాద్ పక్షం నుండి గట్టి ఎదిరింపు ఉన్నా, అది సాధ్యమే. ఈలెక్కన షోలాపూర్ – హైదరాబాద్ మధ్య దూరం 186 మైళ్ళు చొచ్చుకుపోవడానికి 15 రోజులు పడుతుంది.
.
>> “మౌంట్ బాటన్” మాత్రం హైదరాబాద్ సమస్యను సామరస్యపూర్వకంగానే పరిష్కరించాలని నిర్ణయించాడు. అందుకే ఈ “ఆపరేషన్ పోలో” విషయం “గవర్నర్ జనరల్” అయిన ఈయనకి కూడా తెలియానంత రహస్యంగా ఉంచారు. అయితే, ఈ “ఆపరేషన్ పోలో” సన్నాహకాల విషయం ఎలాగోలా మౌంట్ బాటన్ కు చూచాయగా తెలిసింది. ఇక మరో విషయం. మౌంట్ బాటన్ పదవిలో ఉండేంతవరకూ, హైదరాబాద్ మీద సాయుధ చర్య చేపట్టబోమని నెహ్రూ గారు మౌంట్ బాటన్ కు మాట ఇచ్చాడు. – ఎందుకంటే ఈ అంశాన్ని సామరస్యంగానే సాధించాలని మౌంట్ బాటన్ ఆలోచన.
.
…. కాబట్టి, “మౌంట్ బాటన్” ఉండగా ఈ “సైనిక చర్య” – “ఆపరేషన్ పోలో” అన్నది సాధ్యం కాదు. 1948 జూన్ 25 న మౌంట్ బాటన్ పదవీ విరమణ చేశాడు.

.
[ ఆపరేషన్ పోలో]
.  Operation Polo.jpg
>> 1948 జూలై నెల చివరికంతా “ఆపరేషన్ పోలో” ఏర్పాట్లు – ప్రణాళిక సర్వమూ సిద్ధమయ్యాయి. 22వేల సైన్యానికి 22 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు సిద్ధమయ్యాయి. మేజర్ “జనరల్ జయంత్ నాథ్ చౌదరి” ఈ సైనిక చర్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా నియమితులయ్యారు.

jn-chowdariarmy-vehicles
.
>> అయితే , ఇక్కడ భారత సైన్యానికి సైతం ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. గూఢచార దళం అంతా పటిష్టంగా లేదు. నిజాం సైనిక సళాలను గురించి సరైన అంచనా వేయలేకపోయారు. ఈ పనిని ఏజెంట్ “జనరల్ కే.ఎం. మున్షీ” సుగమం చేశారు. వారు, హైదరాబాద్ సైన్యంలోని ఒక అధికారిని లోబరచుకొన్నారు. అతనిద్వారా హైదరాబాద్ సైన్యపు వివరాలను స్పష్టంగానూ – ఖచ్చితంగానూ తెలిశాయి. ఈ సమాచారం భారత సైన్యానికి ఎంతో ఉపకరించింది. అంతే కాదు “జే.ఎన్. చౌదరి”కి హైదరాబాద్ సునాయాసంగా జయించగలం అన్న సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది.

.K M Munshi.jpg
…. భారత సైన్యం సమరోత్సాహంతో యుద్ధభూమిలో దూకడానికి సిద్ధంగా ఉంది..
… అయిదువైపులనుండీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉంది.
…. ఆదేశాల కోసం నిరీక్షిస్తూ ఉంది… !!
.
>> 1948 సెప్టెంబర్ 12 అర్ధరాత్రి భారత ప్రభుత్వం ఆదేశాలు అందాయి. అర్ధరాత్రి దాడి ప్రారంభమయ్యింది.. పశ్చిమ వ్యూహపు సిక్కు సేన 13 సెప్టెంబర్ తెల్లారేసరికి “జల్కోట” గ్రామాన్ని వశపరచుకొంది. అసలు దారిలో ఎదురించేవాడే లేడు.. గ్రామం బయట ఒక ఫిరంగి కనిపించింది.. అది పేలనే లేదు… దాన్నిపేల్చేవాళ్ళు భయపడి పారిపోయారు.
.
>> “బోరి” నదిమీద “నతదుర్గ్” వంతెన కీలకమైనది. దీనికోసం నిజాం సేనలతో హోరాహోరీ తలపడవలసి వస్తుందని భారత సైన్యం అనుకొంది. ఒకవేళ దీన్ని గనక పేల్చివేస్తే పురోగతి సాధ్యంకాదని ఆందోళన చెందింది. అయితే, అత్యంత ఆశ్చర్యంగా ఆ వంతెనకు అసలు రక్షణే లేదు. భారత సైన్యాలు అవలీలగా ఆ వంతెనను దాటేశాయి.
.
>> 1948 సెప్టెంబర్ 13 సాయంత్రానికి 61 మైళ్ళు నిజాం రాజ్యంలోనికి చొచ్చుకొని వచ్చాయి భారత సైన్యాలు. ఎక్కడా నామమాత్రపు ఎదిరింపు కూడా లేదు. నిజాం సైన్యం పత్తా లేదు. అక్కడక్కడా “రజాకార్లు” మాత్రం “అల్లా హో అగ్బర్” అంటూ మిడుతల దందులా అడ్డుపడ్డారు. అంతేవేగంగా పలాయనం చిత్తగించారు.. కాలికి బుద్ధి చెప్పారు.

rajakarsrazakars
.
>> ఇకపోతే, “హైదరాబాద్ వాయుదళం” చాలా పటిష్టమైనదనుకొన్నారు. కానీ అది ఏనుగు పిత్తినట్లయ్యింది. పగటి వేషగాడిమాదిరిగా ఉన్నాయి వాళ్ళ విమానాలు. భారత విమానాలకు ఎక్కడా ఇసుమంత ఆటంకం కూడా కలగలేదు నిరాటంకంగా – అనాయాసంగా – ఎదురే లేకుండా – స్వేచ్చావిహారం చేశాయి.. అలా కొన్ని గంటల్లోనే “నిజాం రాజ్యం యొక్క గగనతలాన్ని మొత్తం” భారత వాయుసేన తనవశం చేసుకొంది.

2068febbfe85014ff2408c85b3707964nizam-airforce
.
>> వాగాడంబరం ఉన్న “నిజాం & రజ్వీ” లు తమ వాయుసేన ప్రతిభా పాటవాలగురించి ఇదివరలో వాగినదంతా కేవలం ఉత్తుత్తిదే అని తేలిపోయింది. నిజాం వాయుదళంలో “వరంగాలు లో ఒకటి” – “బీదర్లో రెండు” విమానాలున్నాయి. ఇకపోతే “సిడ్నీ కాటన్” తెచ్చిన “విమాన విధ్వంసకం” మూటకూడా విప్పనే లేదు. – భారత వాయుసేనలు “తొలిదెబ్బకు వరంగల్లు విమానాన్నీ – మలిదెబ్బకు బీదర్ విమానాలనూ” లేపేశాయి. – “నిజాం వైమానిక దళం” నిద్రకూడా లేవకముందే, వారి వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది.. నిద్రలేచి పేరేడ్ కు వెళ్ళినవాళ్ళకు నుజ్జునుజ్జైన వారి యుద్ధ విమాన శకలాలను చూసి తలతిరిగింది.

.
.. ఇక్కడ ఒక మానవీయ సంఘటన చెప్పుకోవాలి..
.
>> ఆపరేషన్ పోలో నిర్వహణలో భాగంగా “మేజర్ ఫ్రెడ్డీ ఫ్రీ మాంటల్” “జూల్నా – ఔరంగాబాద్” సెక్టార్ లో తన గూర్ఖా సేనతో సాగిపోతున్నాడు. దారిలో ఒక గ్రామం… రక్షణ లేదు – నిజాము దళాలు పత్తా లేవు – ఎక్కడ చూసినా పూరిండ్లు – మట్టి మిద్దెలు – ఆకలితో ఉన్న జనం – ముక్కులు కార్చుకొంటూ పిల్లలు – ఇలా దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ఫ్రెడ్డీ, తుపాకీ పక్కనపెట్టాడు. అక్కడే గ్రామ సేవ ప్రారంభించాడు. అప్పటినుండే ఆ గ్రామానికి “ఫ్రెడ్డీ నగర్” మారుపేరయ్యింది.

Villagers.jpg.
…. 1948 సెప్టెంబర్ 17 వ తేదీకి భారత సైల్యాలు ఇంకా పూర్తిగా నిజాం రాజ్యపు అన్నీ ప్రాంతాలనూ పూర్తిగా చుట్టుముట్టనే లేదు. ఇంకా కొన్ని దళాలు సరిహద్దుకు కొంత దూరంలోనే ఉన్నాయి.
.
…. ఇక్కడ హైదరాబాద్ లో..
.
=> నిజాం దాసోహం అన్నాడు
=> అంతముకుందే సేనలు లొంగిపోయాయి
=> లొంగిపోవాలని నిజాం ఫర్మానా జారీచేశాడు
.
… అదే ఆ నిజాం యొక్క ఆఖరి ఫర్మానా.

patel_nizam.
>> ఇక, “నిజాం లొంగుబాటు” పత్రం సిద్ధమయ్యింది. ఈ పత్రాన్ని “ఆపరేషన్ పోలో” కు నేతృత్వం వహించిన “జే.ఎన్. చౌదరి” తీసుకెళ్ళాల్సి ఉంది. కానీ, “వి.పి. మున్షీ” రాజకీయజ్ఞుడు. నిజాం సైన్యాల ప్రధానాధికారి “మేజర్ జనరల్ అలీ అహమద్ ఎల్ ఎడ్రోస్” ను మున్షీ పిలిపించాడు. లొంగుబాటుకు సంబంధించిన పత్రాన్ని అతడికి అందించాడు. దాన్ని నిజాం కు అందజేయమని చెప్పి, “దక్కన్ రేడియో”లో చదివించే బాధ్యతను అప్పగించాడు. “ఎడ్రోస్” “కింగ్ కోటి”కి చేరుకొన్నాడు.

king-kiti-buindingmajor-general-syed-ahmed-el-edroos

REPORT THIS AD

.చదవాల్సిన పత్రాన్ని నిజాము కు అందజేశాడు. ఆ పత్రంలోని ఒక్క అక్షరాన్ని కూడా మార్చే సాహసం చేయలేదు నిజాం. హుటాహుటిన “సోమాజిగూడ లోని దక్కన్ రేడియో”కు చేరుకొన్నాడు.

=> నిజాం – రాముడు మంచి బాలుని వలె – చదవమన్నట్లు చదివాడు
=> నిజాం – తన పదవీచ్యుతి శాసనాన్ని – తానే స్వయంగా చదివి ప్రజానీకానికి వినిపించాడు
.
… అలా ఈ నిజాము పీడ విరగడయ్యింది.. తరతరాల బూజు వదిలింది..!!

last-nizam10-richest-people-in-world-history-to-ever-live-with-most-money-ealuxe-mir-osman-ali-khan-net-worth
….. ఈలోగా మరో ప్రహసనం జరిగింది..!! – ఇది ఐక్యరాజ్యసమితిలో “నిజాం రాజ్యం” పక్షాన వాదించడానికి “పాకిస్తానుకు పదిలక్షల డబ్బులు చెల్లించడం”.. !!
.
>> నిజాం గారి విదేశీ వ్యవహారాలు చూసే “నవాబ్ మెయిన్ నవాజ్ జంగ్” – హైదరాబాద్ గురించి విన్నవించడానికి “ఐక్యరాజ్యసమితి” కి బయలుదేరాడు. ఆయన “లండన్”కు చేరేసమయానికి ఇక్కడ హైదరాబాద్ మీద పోలీసు చర్య ప్రారంభమయ్యింది. లండన్ కు చేరి ఈ “చివరి రక్తపుబొట్టు” వగైరా డైలాగులు – హైదరాబాద్ నుండి లండన్ కు చేరవేశాడు.
.
>> లండన్ కు చేరుకొన్న ఈ “జంగ్” గారు, అక్కడి పాకిస్థాన్ హైకమీషనర్ “హబీబ్ రహమతుల్లా” దగ్గరికి వెళ్ళాడు. పది లక్షల పౌండ్లు ఇస్తానన్నాడు. విన్న ఆయనకు మతిపోయింది. పాకిస్థాన్ ఒప్పుకొంటే తీసుకొంటానన్నాడు. అప్పటికప్పుడు “పాక్ విదేశాంగ మంత్రి” – ” జఫృల్లాఖాన్” తో మాట్లాడాడు. ఆయన అనుమతించాడు. రహమతుల్లా స్వీకరించాడు.

money-deposited-to-pak-2money-deposited-to-pak
.
>> ఇంతకీ ఇంతడబ్బు నిజాం తరఫున పాకిస్థాన్ కు ఎందుకిచ్చారనేగా మీ అనుమానం ?? “హైదరాబాద్ స్వతంత్ర రాజ్యపు కేసు” కు “ఐక్యరాజ్యసమితిలో” మద్దతు కూడగట్టడానికి. అలా లండన్ వెళ్ళిన “నవాజ్ జంగ్”, సెప్టెంబర్ 16 వ తేదీన తన అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి – భద్రతామండలికి అందజేశాడు. అప్పుడు “సర్ అలెగ్జాండర్ కేడోగాన్” బ్రిటన్ పక్షాన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎనిమిది దేశాలు హైదరాబాద్ ను బలపరచాయి. ఎవ్వరూ వ్యతిరేకించలేదు. చైనా – రష్యా – ఉక్రెయిన్ దేశాలు తటస్థంగా ఉండిపోయాయి.
.
>> అక్కడ ఆ తతంగం జరుగుతుండగానే, ఇక్కడ ఇండియా లో సైనిక చర్య జరిగింది.. సైనిక దళాలు ఎక్కడా పూర్తిగా ఆక్రమించుకొనే లేదు. – నిజాం నవాబు “తాను స్వచ్చందంగా లొంగిపోతున్నానని” రేడియో లో ప్రకటించాడు. ఐనా సరే, “నవాజ్ జంగ్” తన అభ్యర్థనను ఉపసంహరించుకోవడానికి నిరాకరించాడు. ఆ తరవాత నిజాం స్వయంగా ఆ అభ్యర్తనను ఉపసంహరించుకొన్నాడు.

UNO.JPG.
…. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే ఇంత తతంగం జరిగిపోయింది. “ఆజాద్ హైదరాబాద్” నుండి ఆజాద్ తొలగిపోయింది.. ఒట్టి హైదరాబాద్ మిగిలిపోయింది.
.
>> హైదరాబాద్ మీద సైనిక చర్య అన్నది అతి సున్నితమైన అంశం. “సర్దార్ పటేల్ స్థిర సంకల్పం” – “రాజనీతిజ్ఞత” – “వ్యవహార కుశలత” – “కుశాగ్రబుద్ధి” – ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వానికీ – ప్రజలకూ విజయపరంపరను చేకూర్చేలా చేశాయి.
.time_patel_jan27_1947
>> అయితే, ఈ మొత్తం వ్యవహారంలో భారత ప్రభుత్వం – ప్రధాని నెహ్రూ లు హైదరాబాద్ రాష్ట్ర “ప్రజా ఉద్యమ పాత్రను” తక్కువ అంచనా వేయరాదు. భారత సైన్యానికి – అన్నీ రంగాలలోనూ – హైదరాబాద్ సంస్థానం ప్రజలు సహకరించారు. సైన్యానికి పూల దండలతోనూ – మంగళ హారతులతోనూ స్వాగతం పలికారు. ఈ ప్రజా సహకారం, సైనిక చర్యకు ఎంతో తోడ్పడింది.

40330_l_operation-poloindian-army-vehiclespoona-horse-enters-hyderabad-chasing-the-razakars
.
... హైదరాబాద్ సంస్థానంలోని ప్రజా ఉద్యమం బలపడి ఉండి ఉండకపోతే – హైదరాబాద్ మరొక కాశ్మీర్ అయ్యి ఉండేది – ఇందులో మరోమాటకు తావులేదు.
.
=> ఇది ఒక రాజ్యం మీద యుద్ధం కాదు
=> భారత ప్రభుత్వంతో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని నిజాం భగ్నం చేశాడు. – దాన్ని సరిచేయడానికి సైనిక చర్య జరిగింది.
=> హైదరాబాద్ ను భారత సైన్యాలు పూర్తిగా ఆక్రమించనే లేదు
=> దిక్కుతోచని నిజాం నవాబు – తన ఇష్టాపూర్తిగా లొంగిపోయాడు.
=> ఇది నిజాం లొంగుబాటు అనే చెప్పుకోవాలి
=> ఇది యుద్ధం కాబోదు – ఉల్లంగనలను సరిచేయడం అని చెప్పుకోవచ్చు
.
…, మరుసటి రోజే, “మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి” హైదరాబాద్ ప్రభుత్వ బాధ్యతలను స్వీకరించాడు.
.

major-general-joyanto-nath-chaudhuri-talking-with-major-general-syed-ahmed-el-edroosmajor-general-joyanto-nath-chaudhuri-talking-with-major-general-syed-ahmed-el-edroos3
=> రెండున్నర శతాబ్దాల అసఫ్జాహీ పాలన అంతమయ్యింది.
=> చార్మినార్ మీద త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది.
.
… “రాజ్ ప్రముఖ్” గా ప్రభుత్వం వారి నుండి భరణం అందుకొన్నాడు నిజాం.. తదనంతరం ఏర్పడ్డ 1952 మార్చ్ 2 వ తేదీన ఏర్పడ్డ ప్రభుత్వాధినేతగా “బూర్గుల రామకృష్ణా రావు” చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాడు. ఆ ప్రమాణ స్వీకారం & వారి మంత్రివర్గాన్నీ ఇక్కడ చూడవచ్చు.

oath-taking-ceremony-of-b-ramakrishna-raonizam-oath-taking
.
…. ఈ సందర్భంగా “దాశరథి కృష్ణమాచార్యుల” వారి “అగ్నిధార” నుండి.
.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

Dasaradhi krishnamachari.jpg.
... ఇదీ అసలు కథ.. ఇక రాజకీయులు నినదిస్తున్నట్లుగా 17-సెప్టెంబర్ అన్నది
.
– విలీనామా ?
– విమోచనామా ?
– విద్రోహమా ?
– స్వాతంత్రమా ?
….. ఏదైతేనేమీ ?
.
.… నిజాము పీడ విరగడయ్యింది.. మరో కాశ్మీర్ ను గుండెలమీద పడకుండా చేసింది..

No comments:

Post a Comment