Sunday, September 22, 2019

Manu Smriti - తెలుగువాడు శ్రీనివాసు

తెలుగువాడు శ్రీనివాసు మనుస్మృతి కేవలం ఒక ధర్మ శాస్త్రమే తప్ప శాసనాల సంహిత కాదు . శాసించే నియమావళీ కాదు. ఇది ఏ ఒక భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్న ఏ వర్గాన్నీ , సమూహాన్నీ శాసించేందుకు ఉద్దేశించిన న్యాయ సంహిత కాదు.

ప్రధానంగా ఈ ధర్మ శాస్త్రం లో అన్నికాలాల్లో, అన్ని దేశాల్లో మానవుడి సాంఘిక జీవితానికి వర్తించే సూత్రాలు ఉన్నాయి. మనిషి యొక్క, సమాజం యొక్క జీవనం లో నిత్యము, శాశ్వతము అనదగ్గ అంశాలను నొక్కిచెప్పే బోధలు ఉన్నందువల్ల దీని ప్రాముఖ్యం విశ్వ వ్యాప్తమైనది.”
మనువు స్త్రీల గురించి, శూద్రుల గురించి, కులవ్యవస్థ గురించి చెప్పాడనే మాటలన్నీ అసత్యాలు, అర్థసత్యాలు. హిందూ సమాజం మీద తీవ్రాక్షేపణ అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది మనుస్మృతి . ఈ మధ్య దీని మీద హిందూ వ్యతిరేక మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేస్తున్నది. మనువాదం అనేది భయంకరమైన తిట్టుపదమైంది. మనుధర్మ శాస్త్రం పేరు చేబుతేనే హిందువుల్లో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అన్ని వైపులనుంచి దాని మీద వస్తున్న అక్షేపణలకు , అభ్యంతరాలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. కాబట్టి మొదట దాని మీదే దృష్టి పెడదాం. మనుధర్మాన్ని ద్వేషించే, అసహ్యించుకునే వారితో వాదులాడటం నా ఉద్దేశం కాదు. ఇప్పటికే తిరుగులేని నిశ్చిత అభిప్రాయాన్నిఏర్పరుచుకున్న వారితో ఇక్కడ వాదించి , గెలవాలని నేను కోరుకోవటం లేదు.
స్రీల గురించి మనుస్మృతి ఏమి చెప్పింది?
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః ( మనుస్మృతి 3 -56 )
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు. స్త్రీలకు గౌరవం లేని చోట జరిగే దేవతా పూజాది క్రియలన్నీ వ్యర్థం – అంటే స్త్రీలను నెత్తిన పెట్టుకున్నట్టా ? కాళ్ళ కింద వేసి తొక్కినట్టా ?
శోచంతి జామయో యత్ర వినశ్యత్యాసు తత్కులం
న శోచంతి తు యత్రైతా వర్దతే తద్ది సర్వదా ( 3 – 57 )
స్త్రీలు దుఃఖిస్తే వారి దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశించి పోతుంది . స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు , వారి వంశం సదా కళకళలాడుతూ వర్ధిల్లుతుంది – అన్నవాడు మహిళల మేలు కోరినట్టా ? కీడు కోరినట్టా?
సంతుష్తో భార్యయా భర్తా భర్త్రా భార్యా తథైవ చ
యస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వై ధృవం ( 3 -60 )
భర్త భార్యను, భార్య భర్తను సంతోష పెడుతూ ఉంటే ఆ ఇంట నిత్యకల్యాణము గా సంపద నిలుస్తుంది అని హితవు చెప్పటం అతివ ను ఆదరించడమా ? అణచి వేయడమా ?
ప్రజనార్థం మహాభాగాః పూజార్హా గృహ దీప్తయః
స్త్రియః శ్రియశ్చ గేహేషు న విశేషోస్తి కశ్చన ( 9-26 )
సంతతి పొందటానికి కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగినవారు . వారు ఇంటికి కాంతుల వంటి వారు. శ్రీ (సంపద) లేని ఇల్లు ఎలా శోభాయమానం గా ఉండదో స్త్రీ లేని ఇల్లు కూడా కాంతి హీనమే – అన్నవాడు నారీలోకం ఔన్నత్యాన్ని పెంచినట్టా? తుంచినట్టా ?
Delete or hide this
Like
 · Reply · 5h
తెలుగువాడు శ్రీనివాసు
తెలుగువాడు శ్రీనివాసు స్త్రీ విశిష్టతను గుర్తించి , ఆమె డిగ్నిటీని పెంచి సమాజంలో సముచిత గౌరవ స్థానం కల్పించిన మొట్టమొదటి ధర్మవేత్త మనువు. ఆస్తి హక్కుల విషయంలో ” పుత్రేణ దుహితా సమా ” కొడుకు , కూతురు ఇద్దరూ సమానులే అని ప్రాచీన కాలం లోనే ఘంటా పథం గా చాటిన మహనీయుడు మనువు. అదీ ఎంత చక్కగా ?!
యథైవాత్మా తథా పుత్రః పుత్రేణ దుహితా సమా
తస్యామాత్మని తిష్థన్త్యాం కథ మన్యో ధనం హరేత్ ( 9- 130 )
తానెంతో కొడుకంత . కొడుకెంతో కూతురంత . కొడుకులు లేకపోతె
తండ్రి ధనం కూతురికి కాకపొతే ఇంకెవరికి వెళుతుంది ?అలాగే –
మాతుస్తు యౌతకం యత్స్యాత్ కుమారీ భాగ ఏవ సః
దౌహిత్ర ఏవచ హరేదపుత్ర స్యాఖిలం ధనం ( 9- 132 )
జనన్యాం సంస్థితాయాం తు సమం సర్వే సహోదరాః
భజేరన్మాతృకం రిక్థం భగిన్యస్చ సనాభయః ( 9- 192 )
తల్లి చనిపోతే ఆమె స్త్రీ దానం ఆమె కూతుళ్ళకే వెళ్ళాలి . కొడుకులకు చెందకూడదు. తల్లి చనిపోయాక ఆమె పుత్రులు, పెళ్లి కాని కుమార్తెలు తల్లి ధనాన్ని సమానంగా పంచుకోవాలి . పెళ్లి అయిన కూతుళ్ళకు తండ్రి ధనం లాగే తల్లి ధనం లోనూ నాలుగవ పాలు పంచి ఇవ్వాలి .. అని చెప్పిన మనువు స్త్రీలకు శత్రువా ?
అవిశేషేణ పుత్రాణామ్ దాయో భవతి ధర్మతః
మిధునానాం విసర్గాదౌ మను స్వయంభువోబ్రవీత్ ( iii-1-4 )
(పారంపర్యం గా వస్తున్న ఆస్తిలో కుమారులకు, కుమార్తెలకు సమాన హక్కు ఉండాలని సృష్టి ఆరంభంలో స్వాయంభువ మనువు చెప్పాడు. )
Delete or hide this
Like
 · Reply · 5h
తెలుగువాడు శ్రీనివాసు
తెలుగువాడు శ్రీనివాసు మనుస్మృతి గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే వివరాలు యిస్తాను.
Delete or hide this
Like
 · Reply · 5h
తెలుగువాడు శ్రీనివాసు
తెలుగువాడు శ్రీనివాసు లభ్యమవుతున్న 50 రకాల మనుస్మృతులలో దేనికీ ఆ పేరు లేదు. ‘‘మానవ ధర్మశాస్త్రము‘ అనే పేరు ప్రతి అధ్యాయం చివర దాని సారాంశం చెప్పేటప్పడు చెప్పారు. ఇది క్రొత్తగా ఒకరు వ్రాసినది కాదు, సుదీర్ఘకాలంలో అనేకులు వ్రాసినవన్నీ సంకలనం చేసినది. మనువు ఒక్కడే కాదు వ్రాసింది. సరిగ్గా చెప్పాలంటే ప్రాచీన భారతదేశంలోని పరిజ్ఞానాన్ని కూర్చిన కూర్పు... Eighteenth-century philologists Sir William Jones and Karl Wilhelm Friedrich Schlegel assigned Manusmriti to the period of around 1250 BCE and 1000 BCE respectively, which from later linguistic developments is untenable due to the language of the text which must be dated later than the late Vedic texts such as the Upanishads which are themselves dated a few centuries later, around 500 BCE.[11] Later scholarship, shifted the chronology of the text to between 200 BCE and 200 CE.[12][13] Olivelle adds that numismatics evidence, and the mention of gold coins as a fine, suggest that text may date to the 2nd or 3rd century CE.[14]
Most scholars consider the text a composite produced by many authors put together over a long period. Olivelle states that the various ancient and medieval Indian texts claim revisions and editions were derived from the original text with 100,000 verses and 1,080 chapters. However, the text version in modern use, according to Olivelle, is likely the work of a single author or a chairman with research assistants.[15]
Manusmriti, Olivelle states, was not a new document, it drew on other texts, and it reflects "a crystallization of an accumulated knowledge" in ancient India.[16] The root of theoretical models within Manusmriti rely on at least two shastras that pre-date it: artha (statecraft and legal process), and dharma (an ancient Indian concept that includes duties, rights, laws, conduct, virtues and others discussed in various Dharmasutras older than Manusmriti).[16] Its contents can be traced to Kalpasutras of the Vedic era, which led to the development of Smartasutras consisting of Grihyasutras and Dharmasutras.[17] The foundational texts of Manusmriti include many of these sutras, all from an era preceding the common era. Most of these ancient texts are now lost, and only four of have survived: the law codes of Apastamba, Gautama, Baudhayana and Vasishtha.[18]
Delete or hide this
Like
 · Reply · 5h
తెలుగువాడు శ్రీనివాసు
తెలుగువాడు శ్రీనివాసు ఆసక్తి వున్నవారు ముందుగా ఇది చదివితే మిగతా వివరాలిస్తాను. https://en.wikipedia.org/wiki/Manusmriti

No comments:

Post a Comment