అయోధ్యపై నోరెత్త వద్దు
07-11-2019 03:25:13
మంత్రులకు మోదీ ఆదేశం
న్యూఢిల్లీ, నవంబరు 6: అయోధ్య కేసుపై తీర్పు రానున్న తరుణంలో వివాదాలకు తావిచ్చే రీతిలో వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సహచరులను ఆదేశించారు. ‘దేశంలో మతసామరస్యం కాపాడడం మన విధి. అందుచేత అనవసరమైన ప్రకటనలు చేయకండి. సంయమనంతో వ్యవహరించండి’’ అని ఆయన బుధవారం మంత్రివర్గ సమావేశంలో కోరారు. రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై ఈనెల 17లోగా తీర్పు రానుంది. మరోవైపు- తీర్పు రానున్న దశలో ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీలు ముస్లిం వర్గాలకు చేరువయ్యే ప్రయత్నాలు ప్రారంభించాయి. కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ నివాసంలో బుధవారం ముస్లిం సంస్థలు, మేధావులతో ఓ సమావేశం జరిపాయి.

No comments:
Post a Comment