ఇది విశ్లేషణా ? ఇంప్రెషనా?
21-11-2019 02:58:55
ఎనభై శాతం పైగా హిందువులు ఉన్న నేపాల్‌లో నేపాలీ భాష వాడతారు. అక్కడ ప్రజలు అసలు హిందూ మతం పుట్టిన భాషతో సంబంధం లేకుండా వాళ్ళ ఆచార వ్యవహారాలు సాగిస్తున్నారు. అలాంటి సందర్భంలో ‘నేపాలీ’ వాడుతూ కూడా వాళ్ల హిందూతనం ఎలా దెబ్బతినకుండా ఉన్నదో విశదీకరించి ఉంటే బాగుండేది.
ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణగారు భాషకు మతానికి ఉన్న లింక్ గురించి రాస్తూ జగన్ ప్రభుత్వానికి ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంలో ఒక రహస్య అజెండా ఉన్నట్టు భయపెడ్తూ తన ‘కొత్త పలుకు’ కాలమ్‌లో ఒక వ్యాసం రాసారు (నవంబర్ 17, 2019). వ్యాసానికి ‘‘రహస్య అజెండా’’ అన్న శీర్షిక పెట్టి పబ్లిక్ పాలసీ గురించి వ్యాసం పబ్లిక్‌గా విశ్లేషిస్తూ రాసారు. రాధాకృష్ణ గారు -ఇంగ్లీషు మాధ్యమాన్ని అమలు పరచడం వల్ల ప్రజలు మత పరంగా విడిపోతారు అని, ఇంగ్లీషు ప్రవేశ పెట్టడం వల్ల బీసీలు కూడా క్రైస్తవులు అవుతారని ఒక విశ్లేషణ చేసారు. నిజానికి విశ్లేషణగా అనిపించినా ఇది ఒక ‘ఇంప్రెషన్’ లానే ఉంది. ఇది చాలా సీరియస్ టాపిక్. ముఖ్యంగా సెన్సిటివ్ విషయం కూడాను.
అంత క్రిటికల్ విషయంపై ఇంప్రెషన్‌ను విశ్లేషణగా రాసిన రాధాకృష్ణ గారి వ్యాసాన్ని పరిశీలిద్దాం. ఇది ఒక విశ్లేషణ కింద పరిగణించాలంటే అందుకు తగిన ఏ అంశాలను ఆయన చర్చించి ఉండవలసింది అనేది ఒకసారి గమనిద్దాం. ప్రస్తుతానికి రాధాకృష్ణ గారు చెప్పిందే కరెక్ట్ అనుకుని ముందుకెళదాం... ముందుగా రాధాకృష్ణ గారు విశ్లేషించని విషయాలు రెండు ఉన్నాయి:
౧. ఇంగ్లీష్ ఒక మాధ్యమంగా మన ప్రభుత్వ ఆఫీసుల్లో తరతరాలుగా వాడుతున్నారు. ఇంగ్లీషు నోట్స్ పెట్టి తెలుగు ఆఫీసుల్లో మనుగడ సాగిస్తున్న వాళ్ళు క్రైస్తవత్వాన్ని ఎలా అప్రీషియేట్ చేయకుండా ఉండిపోయారో ఆయన విశ్లేషించలేదు.
౨. ఇంగ్లీషును స్కూళ్ళలో బోధించేది విదేశాల నుండి వచ్చిన టీచర్లు కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రం లోనే హిందువులైన టీచర్లు ఇంగ్లీషులో పాఠాలు నేర్పినప్పుడు మతం ఎలా మార్పు జరగగలదో విశ్లేషించ లేదు.
అదే విధంగా రాధా కృష్ణ గారు విస్మరించిన విషయాలు రెండు ఉన్నాయి :
౧. బైబిల్ మొదటగా రాయబడింది హీబ్రూ భాషలో. కాబట్టి– అరబిక్ ఉర్దూ అంటే ఇస్లాం అనీ, సంస్కృతం అంటే హిందూ అనీ (వేద భాష కాబట్టి) అనుకున్నట్టుగా– ఇక్కడ అలాంటి తర్కాన్ని అన్వయించలేము.
౨. ఇంగ్లీష్ మాట్లాడే ఎన్‌ఆర్‌ఐలు, అమెరికా కెళ్ళి గుడులు కట్టుకున్నారు గాని చర్చ్‌లు కట్టలేదు. పిట్స్‌బర్గ్ వేంకటేశ్వరుని ఆలయం ఇంగ్లీష్ నేర్చుకున్న హిందువులు కట్టిందే. ఇందులో రాజీ పడే అంశాలు ప్రత్యేకంగా ఏవన్నా ఉంటాయనేది ప్రస్తావించడం విస్మరించారు.
ఇక రాధాకృష్ణ గారు స్పృశించని విషయాలు రెండు ఉన్నాయి :
౧. మతాన్ని భాషతో ముడి పెట్టాలనుకుంటే, ఏ మాత్రమూ, ఎప్పుడూ ఎక్కడా వాడని సంస్కృతాన్ని మన ఆంధ్ర పిల్లలు ఏక బిగిన ఎందుకు చదవాలి?
2. తెలుగు చదవడం హిందూ మతానికి సంబంధించినదైతే, తెలుగును మాత్రం మత ప్రమేయం లేకుండా ముస్లిములను, క్రైస్తవులను అందరినీ చదవమని అడగడం ఎలా కరెక్ట్ అవుతుంది?
అదే విధంగా రాధాకృష్ణగారు రెండు వైరుధ్యాలను విడమర్చకుండా వదిలేసారు :
౧. హిందీని మనం వాడుకలో ఎక్కువ ఉపయోగించకున్నా ఆంధ్ర దేశంలో కూడా తప్పని సరిగా చదువుతున్నాం. తెలుగు హిందువుల భాష అయితే మరి హిందీ హైందవేతరుల భాషగా పరిగణించవచ్చో లేదో ఒక సందిగ్ధత వస్తుంది.
౨. అలాగే తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషలు హిందూ మత సాంప్రదాయాలకు సంబంధించినవే అవుతాయా.. అవి కూడా హైందవేతర భాషలు అవుతాయా.. అనేది తేల్చాల్సి ఉంది
అలాగే భాషా వ్యవహారానికి, మతానికి సంబంధించిన లింకును మరింత లోతుగా ఈ రెండు విషయాల్లో విడమర్చి ఉంటే మనకు ఆయన ఉద్దేశం, ఆయన ఇంప్రెషన్ ఇంకా స్పష్టంగా తెలిసేది.
౧. మలేషియాలో ముస్లిములు 60 శాతం పైచిలుకు ఉంటారు. కాని అక్కడ ‘మలయ్’ అనే భాష ఎక్కువ మాట్లాడతారు. ఒక మాధ్యమంగా చదువుతారు కూడా. అయితే మిగతా ముస్లిం దేశాలలో అరబిక్ ఎక్కువగా వాడుతారు. భాష విషయంలో ఇలాంటి సంక్లిష్టత ఉన్నప్పుడు, ఒక భాషను ఒక మతానికి సంబంధించిన భాషగా ఎలా కేటగరైజ్ చేస్తాము అన్న విషయం స్పష్టం చేసి ఉండి ఉంటే బాగుండేది.
౨. అలాగే ఎనభై శాతం పైగా హిందువులు ఉన్న నేపాల్‌లో నేపాలీ భాష వాడతారు. అక్కడ ప్రజలు అసలు హిందూ మతం పుట్టిన భాషతో సంబంధం లేకుండా వాళ్ళ ఆచార వ్యవహారాలు సాగిస్తున్నారు. అలాంటి సందర్భంలో ‘నేపాలీ’ వాడుతూ కూడా వాళ్ల హిందూతనం దెబ్బతినకుండా ఎలా ఉన్నదో విశదీకరించి ఉంటే బాగుండేది.
అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఒక కోణాన్ని ఆయన తన దృక్పథంతో చూసినట్టు కనపడలేదు. ఫ్రాన్స్‌లో ఎక్కువ మంది క్రిస్టియన్లే. అక్కడ ఫ్రెంచ్ మాట్లాడుతారు. జర్మనీలో ఎక్కువ మంది క్రిస్టియన్‌లు. అక్కడ జర్మన్ భాష మాట్లాడుతారు. ఈ ఇంగ్లీషు నిజానికి ప్రపంచమంతా కలిపితే ఐదో వంతు కూడా మాట్లాడరు. ప్రపంచంలో సుమారు మూడో వంతు భాగం నివసిస్తున్న క్రైస్తవుల్లో సగానికి పైగా ఇంగ్లీషు మాట్లాడరు. అయినా ఇంగ్లీషు క్రైస్తవులకు సంబంధించిన భాష ఎలా అయ్యిందో ఒక యూనివర్సల్ కోణంలో రాధాకృష్ణగారు విశ్లేషించవలసి ఉండింది.
ఏదేమైనా, క్రైస్తవ మిషనరీలను భాష డిబేట్‌లోకి లాగడం చూస్తుంటే, బ్రిటీష్ వాళ్ళు ఇక్కడకు వచ్చాక క్రైస్తవం వచ్చింది అనే పాయింట్ నుండీ భాషకు లింక్ అప్ చేస్తున్నారని తెలుస్తుంది. నిజానికి ఇంగ్లీష్ మాట్లాడిన దొరల ప్రభుత్వం దేశం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, 1947లో, మన దేశంలో క్రైస్తవులు 1.5 శాతానికి మించి లేరు.
ప్రజలను పత్రికాముఖంగా ఒక సీరియస్, సెన్సిటివ్ విషయంపై ఎడ్యుకేట్ చేయదల్చుకున్నపుడు, ఈ భాష ఈ మతం వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు అన్నట్టు కాకుండా, పై అంశాలతో విశ్లేషించి ఉంటే, ఆ ‘రహస్య అజెండా’ గురించి పూర్తి క్లారిటీ వచ్చి ఉండేది.
పి. విక్టర్ విజయ్ కుమార్
ఇన్‌వెస్ట్‌మెంట్ బేంకర్, రచయిత, విమర్శకుడు

No comments:
Post a Comment