తెలుగువాడు శ్రీనివాసు
వాల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ‘జాక్ మా’ ఆలీబాబా వ్యవస్థాపకుడు విద్య గురించి ఏం చెప్పాడంటే,
‘రాబోయే పదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలను రోబోలు భర్తీచేస్తాయి. యంత్రులతో పోటీ ఎలా పడాలో మనం మన పిల్లలకి నేర్పడం సాధ్యంకాదు. విద్యావిధానాన్ని మార్చడం ద్వారానే మనం యంత్రాలతో పోటీపడగలం. ఉపాధ్యాయులు పిల్లలకి సమాచార విజ్ఞానాన్ని (knowledge) బోధించడం కచ్చితంగా ఆపాల్సిందే. యంత్రులు మనతో ఎన్నడూ పోటీపడలేకుండా వుండే ఓ విశిష్టమైన, ప్రత్యేకమైన విషయాన్ని మనం పిల్లలకు బోధించాల్సి వుంటుంది. గత రెండు వందల ఏళ్లుగా ఆవిష్కరించి, పోగుచేసుకున్న విజ్ఞానం ఆధారంగా ఎన్నడూ బోధించకండి.
ఇప్పుడు విద్య మున్నెన్నడూ లేనంత పెను సవాల్ గా మారింది. బొోధనా విధానాన్ని గనక మనం మార్చుకోకపోయినట్లయితే రాబోయే 30 ఏళ్లలో అత్యంత గడ్డు పరిస్థితిని చవిచూడవలసివస్తుంది. ఎందుకంటే, పిల్లలకి మనం బోధించే విదానం, బోధించే విషయాలన్నీ గత 200 ఏళ్లనుండి ఆవిష్కరింపబడిన శాస్త్రవిజ్ఞానంపై ఆధారపడ్డాయి. ఇది కాాదు కావలసింది. మన పిల్లలకు మనం విలువలను, విశ్వసించడాన్ని, స్వతంత్రంగా ఆలోచించడాన్ని, సమష్టిగా కృషిచేయడాన్ని, ఇతరుల పట్ల శ్రద్ద, పట్టింపును, నేర్పాలి. ఇవే మనిషి నైజంలో సంవేదన శీలతను పెంచే అంశాలు. శాస్త్ర విజ్ఞానం వీటిలో దేనినీ మనకు బోధించదు.
అందుకే, మనం పిల్లలకు ఆటలు, సంగీతం, చిత్రలేఖనం, కళలను బోధించాలని నేను అనుకుంటున్నాను. మనం బోధించేది ప్రతిదీ యంత్రులు చేయగలిగేదానికి విభిన్నంగా వుండాలి.
2030 నాటికి ఓ 80 కోట్ల రోబోలు ఉద్యోగులుగా మనిషి స్థానాన్ని భర్తీచేస్తాయి. అంటే, 80 కోట్ల కుటుంబాలు, మూడు నుండి నాలుగువందల కోట్ల ప్రజలు రోడ్డున పడతారు.******

No comments:
Post a Comment