అనుచిత ఆలోచన
22-11-2019 01:03:51
‘దేశవ్యాప్త ఎన్నార్సీ’ నినాదం హోంమంత్రి అమిత్ షా నోట ఇప్పటికే పలుమార్లు విన్నదే. ఎన్నికల ప్రచార సభల్లో ప్రయోగించిన ఈ అస్త్రానికి బుధవారం రాజ్యసభలో చేసిన ప్రకటనతో అధికారికంగా విలువ చేకూరింది. ఇంతకాలమూ మిగతాదేశం ఈ పౌర రిజిస్టర్ ప్రక్రియను అసోంకు పరిమితమైన వ్యవహారంగానే చూసింది. దేశపౌరులుగా రుజువుచేసుకోవడానికి అసోం వాసులు పడిన కష్టాలు చూసి వేదన పడింది. ఏళ్ళతరబడి సాగిన ఆ వడబోత అంతిమంగా అందించిన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ బాధ తమకు రానందుకు మనసులోనే సంతోషించింది. ఇక ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరు.
అసోం విధానాన్నే దేశవ్యాప్త ఎన్నార్సీలోనూ పాలకులు అమలుచేస్తారో, లేక దానిమీద గుర్రుగా ఉన్నందున ఓ కొత్త విధానాన్ని కనిపెడతారో తెలియదు. మరోపక్క, దేశవ్యాప్త ఎన్నార్సీనుంచి అసోంను మినహాయించబోమని ప్రకటించడం ద్వారా, పాత ఎన్నార్సీ వద్దనీ, కొత్త వడబోత విధానం కావాలన్న అసోం బీజేపీ డిమాండ్‌ను కూడా హోంమంత్రి నెరవేర్చేశారు. పౌరసత్వ పరీక్షను దాటేందుకు ఇక దేశవాసులంతా పరుగులు పెట్టాల్సిందే, చెమట చిందించాల్సిందే.
ADVERTISEMENT
Learn More
POWERED BY PLAYSTREAM
అసోం ఎన్నార్సీ కొండను తవ్వి ఎలుకను పట్టిందన్నమాట నిజం. అక్రమ వలసదారులు తమ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తన్నుకుపోతున్నారనీ, వనరులు కొల్లగొడుతూ సంఖ్యాపరంగా పెరిగిపోతున్నారని స్థానికుల వాదన. వలసదారులను వడగట్టి, వెనక్కుపంపేస్తామన్న అసోం ఒప్పందపు హామీని ప్రభుత్వాలు అమలుచేయనందున, చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో, దాని పర్యవేక్షణలో ఎన్నార్సీ కొనసాగింది. ఎప్పటికప్పుడు న్యాయస్థానం తగుసూచనలతో దానిని నడిపించినా, ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా మార్పు చేర్పులూ చేస్తూ వచ్చినా తమ పౌరసత్వాన్ని రుజువుచేసుకొనేందుకు పౌరులు అష్టకష్టాలూ పడ్డారు. అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. విడుదలైన ప్రతీ ముసాయిదా ప్రజలను భయోత్పాతంలో ముంచేది.
కార్గిల్ యుద్ధవీరులు సహా సమాజంలో ప్రముఖులైన వారిపేర్లు కూడా గల్లంతైనాయి. చివరకు 19లక్షలమందిని పక్కనబెడుతూ విడుదలైన తుదిజాబితా సైతం ఎవరికీ సంతృప్తి కలిగించలేదు. వలసదారుల సంఖ్యను కోట్లు, లక్షలుగా చెబుతూ రాజకీయంగా పబ్బం గడుపుకున్న రాజకీయపార్టీలు కానీ, సుప్రీంకోర్టుతో ఎన్నార్సీ అమలు చేయించిన స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ సంఖ్యతో సంతృప్తి చెందలేదు. మరీ ముఖ్యంగా, ఎన్నార్సీలో ఎక్కువమంది ముస్లింలు, తక్కువమంది హిందువులు బయట ఉండిపోతారని అనుకున్న బీజేపీ తుది ఫలితం తమ ఓటుబ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా లేనందున మరో కొత్త వడబోత కావాలని డిమాండ్ చేయడం ఆరంభించింది. ఇప్పుడు దేశవ్యాప్త ఎన్నార్సీలో అసోంను మినహాయించకపోవడం బీజేపీ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉండవచ్చునేమో కానీ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగిన గత ప్రక్రియను సున్నా చేయడమూ, దానిని అవమానించడమూ అవుతుంది.
అసోంలో ఎన్నార్సీ అవసరం వేరు. దేశమంతా అది జరగాలని ఎవరూ అనుకోవడం లేదు. తమ రాష్ట్రానికీ ఎన్నార్సీ అవసరమని భావిస్తూ, తెస్తామని చెబుతూ వచ్చింది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే. అనుమానాలు, అపోహలతో రగిలిపోతున్న అసోం సమాజాన్ని ఎన్నార్సీ మరింత చీల్చినట్టే, దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయడానికి ఈ కొత్త సంకల్పం ఉపకరిస్తుంది. అసోంలో భవిష్యత్తులో న్యాయపరమైన ప్రక్రియంతా ముగిసి, అంతిమంగా అక్రమవలసదారులుగా నిగ్గుతేలిన ఆ కొద్దిలక్షలమంది విషయంలోనే ఏం చేయాలన్నదీ ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఇది పూర్తిగా భారత్ బాధ అంటూ బంగ్లాదేశ్ ఎప్పుడో చేతులెత్తేసింది. ఎవరినీ తిరిగి తీసుకొనేది లేదని ఆ దేశం అంటుంటే, అప్పగించబోమని భారత్ కూడా హామీ ఇస్తున్నది. మరోపక్క అక్రమవలసదారులన్న ముద్రతో జైళ్ళలో మగ్గుతున్నవారిని పూచీకత్తుతో విడుదల చేయమని సుప్రీంకోర్టు చెబుతూనే ఉన్నది.
ముందుగా, పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లనుంచి వలసవచ్చిన హిందూయేతర మతాలవారికి పౌరసత్వాన్ని ప్రసాదించి, అనంతరం ఆ సేతు హిమాచలం ముస్లింలు లక్ష్యంగా దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు చేయాలన్నది పాలకుల ఆలోచనగా కనిపిస్తున్నది. అక్రమవలసదారులందరినీ ఏరివేయాలన్న ఈశాన్యరాష్ట్రాల డిమాండ్‌ను పౌరసత్వ సవరణ బిల్లుతో వమ్ముచేయడమే కాక, ఈ రెండింటినీ యావత్ దేశంమీద ప్రయోగించాలన్నది ప్రమాదకరమైన నిర్ణయం. ఆర్థిక మాంద్యం సహా సర్వరంగాలూ దెబ్బతినిపోయిన ప్రస్తుత తరుణంలో ఈ చర్య ప్రజల దృష్టిని మరల్చేందుకు పాలకులకు ఉపకరించవచ్చును కానీ, భరించగలిగే స్థితిలో ప్రజలు మాత్రం లేరు.

No comments:
Post a Comment