Wednesday, November 6, 2019

దేశం మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే పాలించనివ్వండి’’ - సుప్రీంకోర్టు

దేశం మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే పాలించనివ్వండి’’ -  సుప్రీంకోర్టు
07-11-2019 03:37:40

వేల మందికిది జీవన్మరణ సమస్య..
ప్రాణాలు కాపాడలేని మీకు ఆ పదవెందుకు?
వాయు కాలుష్యం ప్రభుత్వాల ఘోరవైఫల్యం
మూడు రాష్ట్రాలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
గడ్డిదుబ్బు దహనంపై రైతుల్ని శిక్షించలేమని వ్యాఖ్య
న్యూఢిల్లీ, నవంబరు 6: దేశ రాజధాని పరిధిలో వాయుకాలుష్యాన్ని నివారించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిం ది. నిబంధనలను అతిక్రమించిన వారిని ఉపేక్షించబోమని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ బుధవారం 3 రాష్ట్రా ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను హెచ్చరించింది. ‘‘ప్రజలు చనిపోతున్నారు.ఆస్పత్రుల పాలవుతున్నారు. విమానాల్ని దారి మళ్లించాల్సిన పరిస్థితి. స్కూళ్లు పనిచేయట్లేదు. ట్రాఫిక్‌ అస్తవ్యస్తం.. ఇంతజరుగుతున్నా మీకుసిగ్గుగా అనిపించడం లేదా? వాస్తవాలు విస్మరించి కులాసాగా మీ భవనాల్లో కూర్చుంటా రా? దేశాన్ని మరో వందేళ్లు వెనక్కి తీసుకుపోతారా?’’అని చెరిగిపారేసింది.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


‘‘ప్రభుత్వ ఉన్నతాధికారులను శిక్షించే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది కూడా గోధుమ గడ్డిదుబ్బులను, ఇతర వ్యర్థాలను తగులబెడతారని తెలుసు. అయినా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదు? రైతుల నుంచి వ్యర్థాలను సేకరించడమో, కొనుగోలు చేయడమో ఎం దుకు చేయలేదు? ఇది కోట్లాది ప్రజల జీవన్మరణ సమస్య. రాజధాని పరిధిలోని ప్రజలంతా కాలుష్యంతో చావాల్సిందేనా? మీకు పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ప్రజల ప్రా ణాలు కాపాడలేనప్పుడు పదవిలో ఎందుకున్నట్టు? ప్రతిదీ కేంద్రమే చేయాలంటే దేశం మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే పాలించనివ్వండి’’ అంటూ పంజాబ్‌ సీఎ్‌సను ఉద్దేశించి బెంచ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విధి నిర్వహణలో దారుణంగా విఫలమైన మీరు ఆ కుర్చీలో ఉండటం అనవసరమంటూ ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనంపై రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

యంత్రాల కొనుగోలుకు ప్రాధాన్యమివ్వండి
వ్యవసాయ శాఖకు మోదీ ఆదేశం
న్యూఢిల్లీ, నవంబరు 6: సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో చీవా ట్లు పెట్టడంతో కేంద్రం స్పందించింది. గడ్డిదుబ్బు దహనాన్ని ఆపేందుకు 3 రాష్ట్రాల్లోని రైతులకు యంత్రాలు సమకూర్చడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ వ్యవసాయ శాఖను ఆదేశించారు. యంత్రాల ద్వారా ఈ గడ్డిదుబ్బును నిర్మూలించేందుకు పంజాబ్‌, హరియాణా సర్కార్లు సబ్సిడీ ఇస్తున్నాయంటూ దేశ రాజధానిలో కాలుష్య నివారణకు ఈ సబ్సిడీని అవసరమైతే విస్తరించాలని, యూపీ సర్కారు కూడా దీనిని అమలు చేయాలని ప్రధాని కోరారు.

No comments:

Post a Comment